సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మొదటిసారిగా కుంకుమపువ్వు (కశ్మీరీ సాఫ్రాన్) సాగు చేసిన విహారీ అనే వ్యక్తిని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. కశ్మీర్‌లో కంటే తక్కువ స్థలంలో 20 రెట్ల సామర్థ్యంతో కుంకుమపువ్వు సాగు చేపట్టినట్లు కేటీఆర్‌కు పంపిన ట్వీట్‌లో విహారీ పేర్కొన్నారు. దీనిపై ఉద్యానశాఖ అధికారులను సంప్రదించగా, ఈ విషయం తమ దృష్టికి రాలేదని, ఎవరో అర్బన్ ఫార్మింగ్‌లో భాగంగా కొద్ది స్థలంలో పండించి ఉండొచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment