ఒకేషనల్‌ కాలేజీకి ఓకే | Telangana Likely To Construct Vocational College In Tarnaka | Sakshi
Sakshi News home page

ఒకేషనల్‌ కాలేజీకి ఓకే

Published Sun, Jul 10 2022 1:10 AM | Last Updated on Sun, Jul 10 2022 3:16 PM

Telangana Likely To Construct Vocational College In Tarnaka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల నర్సింగ్‌ కళాశాలను ప్రారంభించిన ఆర్టీసీ సంస్థ మరో ముందడుగు వేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఒకేషనల్‌ కాలే­జీని అందుబాటులోకి తెస్తోంది. తార్నాకలోని రవాణా సంస్థ ఆసుపత్రికి అనుబంధంగా దీనిని ఏర్పాటు చేస్తోంది. తార్నాక ఆసుపత్రిని సూపర్‌­స్పెషాలిటీ హాస్పిటల్‌గా మారుస్తున్న విషయం తెలిసిందే.

200 పడకల ఈ ఆసుపత్రిలో ఇంతకా­లం కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ­సభ్యులకు మాత్రమే చికిత్స చేసేవారు. ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా విస్తరించనున్నారు. ఈ క్రమంలో దానికి అనుబంధంగా ఒకేషనల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ నిర్ణయించారు. 2022–23 విద్యాసంవత్సరం నుంచే అడ్మి­షన్ల ప్రక్రియ చేపడుతున్నారు.

ఒకేషనల్‌ కళాశాల­లో తొలుత మెడికల్‌ లెబొరేటరీ టెక్నాలజీ(ఎంఎల్‌టీ), ఫిజియోథెరపీ(పీటీ), మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్క­ర్‌ కోర్సులను ప్రారంభిస్తున్నారు. రెండేళ్ల వ్యవ«­ది ఉండే ఈ కోర్సులకు 30 చొప్పున సీట్లను కేటా­యించారు. ఇందులో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ కోర్సు పూర్తిగా యువతులకే కాగా, మిగతా రెండింటిని కో–ఎడ్యుకేషన్‌ క్లాసెస్‌గానే నిర్వహించనున్నారు. 

దరఖాస్తుల ఆహ్వానం
పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుల్లో చేరటా­నికి అర్హులు. మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలోనే ఈ కళాశాల కొనసాగుతుంది. ఇటీవల ఇక్కడ ప్రారంభించిన నర్సింగ్‌ కాలేజీలో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం 5 సీట్లు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. కానీ, ఒకేషనల్‌ కాలేజీ­లో మాత్రం అలాంటి వెసులుబాటు కల్పించలేదు. 

ఫీజు రూ.15 వేల నుంచి రూ.20 వేలు
ఈ కోర్సులకు ఇంకా ఫీజులను నిర్ధారించలేదు. కానీ, ఫీజులు రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. నర్సింగ్‌ కాలేజీ కోసం అదే ప్రాంగణంలో ప్రత్యేకంగా హాస్టల్‌ వసతి కల్పించగా, ఒకేషనల్‌ కాలేజీకి మాత్రం ఆ వెసులుబాటు లేదు. 

ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి
ఒకేషనల్‌ కాలేజీని ఈ విద్యాసంవత్సరమే ప్రారంభిస్తున్నాం. ఆసక్తి ఉన్న అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 73828 35579, 95736 37594 నంబర్లలో సంప్రదించవచ్చు. లేదంటే నేరుగా తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి వచ్చి 
సంప్రదించవచ్చు.                
– శైలజ, ఆర్టీసీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement