వచ్చే ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు!  | Telangana: Minister KTR Inaugurates Massmutual Center In Hyderabad | Sakshi

వచ్చే ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు! 

Dec 18 2021 2:32 AM | Updated on Dec 18 2021 7:25 AM

Telangana: Minister KTR Inaugurates Massmutual Center In Hyderabad - Sakshi

గచ్చిబౌలి: రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో 50 వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ జీవిత బీమా సంస్థ మసాచ్యుసెట్స్‌ మ్యూచువల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (మాస్‌మ్యూచ్‌వల్‌) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో 50 వేల ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలను తీసుకొస్తామన్నారు. దేశంలోనే అత్యంత నివాస యోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. కేంద్ర బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఐ) కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉందని కేటీఆర్‌ గుర్తుచేశారు. 

భాగ్యనగరం బెంగళూరులా కాదు.. 
హైదరాబాద్‌ను అసలైన కాస్మోపాలిటన్‌ నగరంగా ఆయన అభివర్ణించారు. రాజకీయంగా ఏకీభవించనప్పటికీ మునావర్‌ ఫారూకీ, కునాల్‌ కామ్రా వంటి స్టాండప్‌ కమెడియన్లు హైదరాబాద్‌లో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే తాము రద్దు చేయబోమని పరోక్షంగా బెంగళూరులో ఉదంతాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement