సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆదివారం జరగనుంది. దీని కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పేపర్–1కు 3,51,468 మంది, పేపర్–2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లబాటయ్యేలా మార్పులు చేయడంతో బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు.
వాస్తవానికి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన అభ్య ర్థులు టెట్ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులవుతారు. పేపర్–2ను బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత పొందుతారు. ఈసారి పేపర్–2 రాసే వారు కూడా పేపర్–1 రాసి, ఎస్‌జీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు. దీంతో పేపర్–1కు దరఖాస్తులు భారీగా వచ్చాయి.
టెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 212 పరీక్ష కేంద్రాలున్నాయి. రాజ ధానిలో మొత్తం 50,600 మంది పరీక్ష రాస్తున్నారు. ములుగులో అతి తక్కువగా 15 పరీక్ష కేంద్రాలున్నా యి. ఈ జిల్లాలో దాదాపు 2,200 మంది పరీక్ష రాస్తున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వీటిని ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. ప్రశ్నప త్రం ఓపెన్ చేయడం మొదలు కొని, ప్యాక్ చేసే వరకూ వీడియో రికార్డింగ్ చేయాలని ఉన్నతాధికా రులు ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లు పరీక్షను పర్య వేక్షించనున్నారు. పరీక్షాకేంద్రాల్లో ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనపై శుక్రవారం ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. పరీక్షాకేంద్రాల చిరునామాలు సక్రమంగా లేవని, అభ్యర్థుల హాల్ టికెట్లపై ఫొటోలు, సంతకాలు ముద్రితం కాలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో తగిన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను విద్యామంత్రి ఆదేశించారు.
‘టెట్’ను వాయిదా వేయండి..
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ), రాష్ట్రస్థాయి లో నిర్వహించే టెట్ ఒకేరోజు జరుగుతున్నందున టెట్‌ను వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేర్వేరుగా కోరారు.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
♦టెట్ పరీక్ష పేపర్–1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకూ ఉంటుంది. పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకూ ఉంటుంది. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు.
♦ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు హాలులోకి అనుమతించరు. వాటిని ముందే పరీక్షాకేంద్రంలో సూచించిన ప్రదేశంలో భద్రప ర్చుకోవాలి.
♦ఓఎంఆర్ షీట్‌పై సర్కిల్స్ నింపేందుకు బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను ఉపయోగించాలి. ఓఎంఆర్ షీట్‌ను ముడవడం, చించడం చేయ కూడదు. దీనివల్ల కంప్యూటర్ మార్కులను తీసుకునే అవకాశం ఉండదు.
♦హాల్‌టికెట్లపై అభ్యర్థి, అధికారుల సంతకం, అభ్యర్థి ఫొటో లేకపోతే గెజిటెడ్ అధికారి సమ క్షంలో ఫొటో అంటించి, ధ్రువీకరణ తీసుకుని, డీఈవో ద్వారా అనుమతి పొందాలి.
Comments
Please login to add a commentAdd a comment