సాక్షి, మహబూబాబాదు: కేవలం పన్నెండు ఏళ్ల వయసుకే భారీ బాధ్యతలను భుజాన వేసుకుని.. వ్యాపారంలో రాణించడమే కాదు, మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికై వార్తల్లో ప్రముఖంగా నిలిచారు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి).
వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి.. వరంగల్ అర్బన్ జిల్లా కేసముద్రం మండలం,ఇనగుర్తి గ్రామంలో(ప్రస్తుతం మహబూబాబాదు పరిధిలో) జన్మించారు. తండ్రి వెంకట నరసయ్య స్థాపించిన రైస్ మిల్లును 12 సంవత్సరాల వయస్సులోనే బాధ్యతలు చేపట్టడం విశేషం. తండ్రి స్ఫూర్తితో వ్యాపారంలో రాణించి.. క్రమక్రమంగా గ్రానైట్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. క్వారీలు, గ్రానైట్ పరిశ్రమలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు.
లక్షల మందికి జీవనోపాధిని అందించిన వ్యక్తిగా ఆయనకు స్థానికంగా పేరుంది. గ్రానైట్ ఇండస్ట్రీ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లోని గాయత్రి గ్రానైట్ ఆర్గనైజేషన్ ఈయన ఆధ్వర్యంలో నడుస్తున్నదే. గత ఎన్నికల్లో వరంగర్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసి ఓడిన గాయత్రి రవి.. ఆ తర్వాత టిఆర్ఏస్ లో చేరారు. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటింపబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment