Rajyasabha candidates
-
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్ సీపీ
-
వద్దిరాజు రవిచంద్ర: రైస్ మిల్లుతో మొదలైన ప్రయాణం..
సాక్షి, మహబూబాబాదు: కేవలం పన్నెండు ఏళ్ల వయసుకే భారీ బాధ్యతలను భుజాన వేసుకుని.. వ్యాపారంలో రాణించడమే కాదు, మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికై వార్తల్లో ప్రముఖంగా నిలిచారు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి). వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి.. వరంగల్ అర్బన్ జిల్లా కేసముద్రం మండలం,ఇనగుర్తి గ్రామంలో(ప్రస్తుతం మహబూబాబాదు పరిధిలో) జన్మించారు. తండ్రి వెంకట నరసయ్య స్థాపించిన రైస్ మిల్లును 12 సంవత్సరాల వయస్సులోనే బాధ్యతలు చేపట్టడం విశేషం. తండ్రి స్ఫూర్తితో వ్యాపారంలో రాణించి.. క్రమక్రమంగా గ్రానైట్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. క్వారీలు, గ్రానైట్ పరిశ్రమలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. లక్షల మందికి జీవనోపాధిని అందించిన వ్యక్తిగా ఆయనకు స్థానికంగా పేరుంది. గ్రానైట్ ఇండస్ట్రీ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లోని గాయత్రి గ్రానైట్ ఆర్గనైజేషన్ ఈయన ఆధ్వర్యంలో నడుస్తున్నదే. గత ఎన్నికల్లో వరంగర్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసి ఓడిన గాయత్రి రవి.. ఆ తర్వాత టిఆర్ఏస్ లో చేరారు. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటింపబడ్డారు. -
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ
-
రాజ్యసభ అభ్యర్ధుల సగటు ఆస్తి ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన 63 మంది అభ్యర్ధుల్లో రూ 122 కోట్ల సగటు ఆస్తులతో 87 శాతం మంది కోటీశ్వరులే. 63 మంది అభ్యర్థుల్లో 55 మంది కోటీశ్వరులే (రూ కోటికి పైగా ఆస్తులు) అయినా కొద్దిమంది అత్యంత సంపన్నుల ఆస్తుల కారణంగా సగటు ఆస్తుల్లో భారీ పెరుగుదల చోటుచేసుకుందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. రాజ్యసభ అభ్యర్ధుల్లో జేడీ(యూ)కు చెందిన మహేంద్ర ప్రసాద్ రూ 4,078 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభ బరిలో ఉన్న జయాబచ్చన్ రూ 1001 కోట్ల ఆస్తులు ప్రకటించి తర్వాతి స్ధానంలో ఉన్నారు. కాగా కేవలం రూ 4 లక్షల ఆస్తులతో బిజూ జనతాదళ్‌కు చెదిన అచ్యుతానంద సమనంతా నిరుపేద అభ్యర్థి కావడం గమనార్హం. బీజేపీ అభ్యర్థి సమీర్ ఓరాన్ రూ 18 లక్షల ఆస్తులతో ఆయన తర్వాత తక్కువ ఆస్తులు కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ప్రధాన పార్టీల్లో బీజేపీ తరపున పోటీలో ఉన్న 29 మందిలో 26, కాంగ్రెస్ నుంచి 11 మంది అభ్యర్ధుల్లో 10, తృణమూల్ అభ్యర్ధుల్లో నలుగురికి గాను ముగ్గురు, టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులూ , జేడీ(యూ)కు చెందిన ఇద్దరు అభ్యర్ధులూ రూ కోటికి పైగా ఆస్తులను ప్రకటించారు. ఇక పార్టీలవారీగా చూస్తూ ప్రతి అభ్యర్థి సగటు నికర ఆస్తులు బీజేపీ 29 మంది అభ్యర్ధుల సగటు ఆస్తి రూ 16 కోట్లు కాగా, 11 మంది కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ 66 కోట్లు, నలుగురు తృణమూల్ అభ్యర్ధుల సగటు ఆస్తులు అతి తక్కువగా రూ కోటి కావడం గమనార్హం. -
రాజస్తాన్ నుంచి రాజ్యసభకు వెంకయ్య
కర్ణాటక నుంచి నిర్మల.. బీజేపీ జాబితా విడుదల సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును బీజేపీ ఈసారి రాజస్తాన్ నుంచి రాజ్యసభ బరిలో నిలిపింది. 1998 నుంచి మూడుసార్లు కర్ణాటక నుంచి పెద్దల సభలోకి అడుగుపెట్టిన వెంకయ్య స్థానంలో ఈసారి మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు అవకాశమిచ్చింది. జూన్ 11న జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు 12 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం ప్రకటించింది. ఈ నెల 31న రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుండటంతో.. రెండో జాబితాను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఆదివారం విడుదల చేసి న జాబితాలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను హరియాణా నుంచి, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను మహారాష్ట్ర నుంచి రీనామినేట్ చేసింది. గతంలో యూపీ నుంచి నామినేట్ అయిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఈసారి జార్ఖండ్ నుంచి, అనిల్ దవేను మధ్యప్రదేశ్ నుంచి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం రూపాలను గుజరాత్ నుంచి, మరో ఉపాధ్యక్షుడు ఓం ప్రకాష్ మాధుర్‌ను రాజస్తాన్ నుంచి బరిలోకి దింపింది.