bio data
-
ఇదీ తెలంగాణ మంత్రుల బయోడేటా
జూపల్లి కృష్ణారావు పుట్టిన తేదీ: ఆగస్టు 10, 1955 స్వస్థలం: పెద్దదగడ, చిన్నంబావి మండలం (వనపర్తి జిల్లా) విద్యార్హత: బీఏ తల్లిదండ్రులు: జూపల్లి రత్నమ్మ – శేషగిరిరావు భార్య, పిల్లలు: జె.సుజన, వరుణ్, అరుణ్ రాజకీయ నేపథ్యం: బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే: కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 1999 (కాంగ్రెస్), 2004 (స్వతంత్ర), 2009 (కాంగ్రెస్), 2012 ఉపఎన్నిక, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి: 2009 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య కేబినెట్లలో ఆహార, పౌరసరఫరాలు, తూనికలు – కొలతలు, వినిమయ వ్యవహారాల శాఖల మంత్రిగా, ఆ తర్వాత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ, ధర్మాదాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో కేసీఆర్ కేబినెట్లో తొలుత ఐటీ, పరిశ్రమలు, ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. కొండా సురేఖ పుట్టిన తేదీ: 19 ఆగస్టు 1965 స్వస్థలం: వంచనగిరి, గీసు కొండ మండలం (వరంగల్ జిల్లా) విద్యార్హత: బీకాం తల్లిదండ్రులు: తుమ్మ రా«ద – చంద్రమౌళి భర్త: కొండా మురళీధర్ రావు మాజీ ఎమ్మెల్సీ కూతురు: సుష్మితాపటేల్ రాజకీయ నేపథ్యం: 1995లో వంచనగిరి ఎంపీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించి గీసుకొండ ఎంపీపీ నుంచి మంత్రి దాకా ఆమె ప్రస్థానం కొనసాగింది. ఎమ్మెల్యే: శాయంపేట సెగ్మెంట్ నుంచి 1999, 2004 (కాంగ్రెస్), పరకాల నుంచి 2009 (కాంగ్రెస్), వరంగల్ తూర్పు నుంచి 2014 (టీఆర్ఎస్), 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి: 2009 వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో శిశు మహిళా సంక్షేమ అభివృద్ధిశాఖ మంత్రి. పార్టీ పదవులు: పీసీసీ సభ్యురాలు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కోశాధికారి, ఏఐసీసీ సభ్యురాలు. కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పుట్టిన తేదీ: జూన్ 20, 1962 స్వస్థలం: తాటిపాముల, తిరుమలగిరి మండలం (సూర్యాపేట జిల్లా) విద్యార్హత: నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి బీఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. (సీనియర్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి ఉన్నారు) తల్లిదండ్రులు: ఉషాదేవి– పురుషోత్తంరెడ్డి భార్య: పద్మావతి (కోదాడ ఎమ్మెల్యే) రాజకీయ నేపథ్యం: రాష్ట్రపతి భవన్లో ఉద్యోగానికి రాజీనామా చేసి 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే: 1999, 2004లో కోదాడ నుంచి, 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు మంత్రి: ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఎంపీ: 2019 లోక్‌సభఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎన్నిక పార్టీ పదవులు: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీపీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. తుమ్మల నాగేశ్వరరావు పుట్టిన తేదీ: మే 20, 1953, స్వస్థలం: గండుగులపల్లి, దమ్మపేట మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) తల్లిదండ్రులు: మాణిక్యమ్మ– లక్ష్మయ్య, విద్యాభ్యాసం: బీకాం భార్య: భ్రమరాంబ, కుమారుడు యుగంధర్, కుమార్తెలు డాక్టర్ జగన్మోహిని, చంద్రిక రాజకీయ నేపథ్యం: టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పనిచేశారు. తాజాగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హయాంలో ఉమ్మడి ఏపీలో చిన్ననీటి పారుదల శాఖ, ప్రొహిబిషన్, భారీ, మధ్యతరహా నీటి పారుదలశాఖ, ఎక్సైజ్, ఆర్అండ్బీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్అండ్బీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యే: 1985, 1994, 1999 (సత్తుపల్లి), 2009 (ఖమ్మం), 2016 (పాలేరు), 2023 (ఖమ్మం) మంత్రి: ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, కేసీఆర్ కేబినెట్లలో ఎమ్మెల్సీ: టీఆర్ఎస్ నుంచి 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ధనసరి అనసూయ (సీతక్క) పుట్టిన తేదీ: జూలై 9, 1971 స్వస్థలం: జగన్నపేట, ములుగు మండలం (ములుగు జిల్లా) విద్యార్హత : ఎల్ఎల్బీ, ఆదివాసీల జీవనం – సంప్రదాయాలు – నైపుణ్యంపై పరిశోధన చేసి ఉస్మానియూ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తల్లిదండ్రులు: సమ్మక్క–సారయ్య, భర్త, పిల్లలు: రామన్న, సూర్య (కుమారుడు) రాజకీయ నేపథ్యం: 10వ తరగతి పూర్తయ్యాక 1988లో విప్లవోద్యమంలో చేరిక. సీపీఐ (ఎంఎల్) జనశక్తిలో చేరిక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి దళ లీడర్‌గా ప్రధాన భూమిక. 1997లో సాధారణ క్షమాభిక్ష పథకం కింద పోలీసులకు లొంగిపోయారు. 2001లో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే: ములుగు అసెంబ్లీ సెగ్మెంట్‌కు 2009 (టీడీపీ), 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే. పార్టీ పదవులు: తెలుగు మహిళా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ప్రస్తుతం ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన తేదీ: అక్టోబర్ 28, 1965, స్వస్థలం: నారాయణపురం, కల్లూరు మండలం(ఖమ్మం జిల్లా) తల్లిదండ్రులు: స్వరాజ్యం– రాఘవరెడ్డి, విద్యాభ్యాసం: బీఏ భార్య: మాధురి, కుమారుడు హర్షారెడ్డి, కుమార్తె సప్నిరెడ్డి రాజకీయ నేపథ్యం: 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2014లో ఖమ్మం లోక్‌సభ స్థానంలో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2016 బీఆర్ఎస్లో చేరిన ఆయన 2014 సెప్టెంబర్ 1 నుంచి 2019 వరకు రవాణా, పర్యాటక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది జూలై 2న రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎంపీ: 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యే: 2023 పాలేరు సెగ్మెంట్‌కు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. సీలారపు దామోదర రాజనర్సింహ పుట్టిన తేదీ: డిసెంబర్ 5, 1958 స్వస్థలం: జోగిపేట (సంగారెడ్డి జిల్లా) విద్యార్హత: ఇంజనీరింగ్ తల్లిదండ్రులు: జానాబాయి– రాజనర్సింహ (మాజీ మంత్రి) భార్య, కూతురు: పద్మిని, త్రిష రాజకీయ నేపథ్యం: వారసత్వంగా రాజకీయాల్లో వచ్చారు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. ఎమ్మెల్యే: అందోల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 1989, 2004, 2009, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి: 2006 వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్లోనూ పనిచేశారు. 2010–2014 వరకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. పార్టీ పదవులు: సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ పుట్టిన తేదీ: డిసెంబర్ 9, 1967 స్వస్థలం: కరీంనగర్ విద్యార్హత: ఎంఏ, ఎల్ఎల్బీ తల్లిదండ్రులు: మల్లమ్మ–సత్తయ్యగౌడ్ భార్య, పిల్లలు: మంజుల, పృథ్వీ, ప్రణవ్ రాజకీయ నేపథ్యం: ఎస్ఆర్ఆర్ కాలేజీకి కాంగ్రెస్ అనుబంధ విభాగమైన ఎన్ఎస్యూ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2005–09 మధ్యకాలంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ పనిచేశారు. ఎంపీ: 2009 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఎమ్మెల్యే: 2023 ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ పదవులు: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పుట్టినతేదీ: మే, 23 1965 స్వస్థలం: బ్రాహ్మణవెల్లెంల, నార్కట్‌పల్లి మండలం (నల్లగొండ జిల్లా) విద్యార్హత: ఇంజనీరింగ్ (సివిల్) తల్లిదండ్రులు: సుశీలమ్మ–పాపిరెడ్డి భార్య, పిల్లలు: భార్య సబిత, కూతురు శ్రీనిధిరెడ్డి, కుమారుడు ప్రతీక్‌రెడ్డి (కుమారుడు 2011లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు) రాజకీయ నేపథ్యం: 1986–1993 వరకు ఎస్ఎస్యూఐ నల్లగొండ జిల్లా ఇన్చార్జ్గా, 1993– 1998 వరకు యువజన కాంగ్రెస్ రాష్ట్రనేతగా పనిచేశారు. ఎమ్మెల్యే: నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 1999, 2004, 2009, 2014, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి: వైఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో. ఎంపీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా గెలిచారు. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పుట్టిన తేదీ: జూన్ 6, 1969 స్వస్థలం: మంథని (పెద్దపల్లి జిల్లా) విద్యార్హత: ఢిల్లీ యూనివ ర్సిటీ నుంచి న్యాయశాస్త్రం, హెచ్‌సీయూ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పీజీ తల్లిదండ్రులు : జయశ్రీ – దుద్దిళ్ల శ్రీపాదరావు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్) భార్య, పిల్లలు: శైలజ రామయ్యర్ (సీనియర్ ఐఏఎస్), ఆదిత శ్రీపాద, అనిరుధ్ శ్రీపాద రాజకీయ నేపథ్యం: దుద్దిళ్ల శ్రీపాదరావును నక్సలైట్లు హత్య చేయడంతో ఆకస్మికంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యే: మంథని అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున 1999, 2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. విప్: ఉమ్మడి ఏపీలో 2004–2009 వరకు మంత్రి: 2009–14లో వైఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో ఉన్నత విద్యా శాఖ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు. పార్టీ పదవులు: ఏఐసీసీ సెక్రటరీ మల్లు భట్టి విక్రమార్క పుట్టిన తేదీ: జూన్ 15, 1961 స్వస్థలం: స్నానాల లక్ష్మీపురం, వైరా, ఖమ్మం జిల్లా. విద్యార్హత: ఎంఏ తల్లిదండ్రులు: మాణిక్యమ్మ – అఖిలాండ భార్య, పిల్లలు: నందిని, కుమారులు సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య రాజకీయ నేపథ్యం: మధిర సెగ్మెంట్ నుంచి 2009 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన సోదరులైన మల్లు అనంతరాములు, మల్లు రవిలు నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. అనంతరాములు పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీ: ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున 2007లో ఎమ్మెల్సీగా గెలిచారు. ఎమ్మెల్యే: మధిర నుంచి 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వరుసగా గెలిచారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్: 2009 నుంచి 2011 ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్: 2011 నుంచి 2014 వరకు సీఎల్పీ నేత: 2019 నుంచి 2023 పార్టీ పదవులు: పీసీసీ కార్యదర్శి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ -
Shelly Oberoi: మేయర్ పీఠంపై మాజీ ప్రొఫెసర్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై పదిహేనేళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ఆధిపత్యానికి చెక్ పెట్టింది ఆప్. డిసెంబర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఎన్నికల్లో.. ఆప్ స్పష్టమైన విజయం సాధించినప్పటికీ రెండు నెలలపై సభ్యుల ఆందోళనతో, ఎల్జీ నిర్ణయంతో.. మేయర్ ఎన్నికపై హైడ్రామా కొనసాగింది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఊరటతో ఆప్ విజయం సునాయసమైంది. ఆ పార్టీ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్.. బుధవారం జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నికలో ఘన విజయం సాధించారు. ఆమె నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. షెల్లీ ఒబెరాయ్(39).. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో ఉన్నత డిగ్రీ పూర్తి చేశారు. ఐఐఎం కోజికోడ్(కేరళ)లో మేనేజ్మెంట్ పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా గతంలో పని చేసిన ఆమె.. మొట్టమొదటిసారి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈస్ట్ పటేల్ నగర్ వార్డ్(86వ వార్డ్) నుంచి ఆమె కౌన్సిలర్‌గా నెగ్గారు. 2013-14 నుంచి ఆప్‌లో కొనసాగుతున్న ఆమె.. 2020లో మహిళా మోర్చా విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ప్రచార సమయంలో షెల్లీ ఒబెరాయ్ జనాల్లోకి వెళ్లిన తీరుపై విస్తృతంగా చర్చ కూడా జరిగింది. షెల్లీ ఒబెరాయ్.. ఇండియన్ కామర్స్ అసోషియేషన్‌లో లైఫ్‌టైం మెంబర్. ఇందిరా గాంధీ ఒపెన్ యూనివర్సిటీ నుంచి ఆమె స్కూల్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో పీహెచ్డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్ నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు. పలు దేశీయ,అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. షెల్లీ ఒబెరాయ్ తండ్రి సతీష్ కుమార్ వ్యాపారవేత్త. తల్లి సరోజ్ గృహిణి. ఆమెకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. కిందటి నెలలో మేయర్ ఎన్నిక సజావుగా జరిగేందుకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పైనే తాజాగా ఆప్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. ::సాక్షి ప్రత్యేకం -
వద్దిరాజు రవిచంద్ర: రైస్ మిల్లుతో మొదలైన ప్రయాణం..
సాక్షి, మహబూబాబాదు: కేవలం పన్నెండు ఏళ్ల వయసుకే భారీ బాధ్యతలను భుజాన వేసుకుని.. వ్యాపారంలో రాణించడమే కాదు, మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికై వార్తల్లో ప్రముఖంగా నిలిచారు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి). వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి.. వరంగల్ అర్బన్ జిల్లా కేసముద్రం మండలం,ఇనగుర్తి గ్రామంలో(ప్రస్తుతం మహబూబాబాదు పరిధిలో) జన్మించారు. తండ్రి వెంకట నరసయ్య స్థాపించిన రైస్ మిల్లును 12 సంవత్సరాల వయస్సులోనే బాధ్యతలు చేపట్టడం విశేషం. తండ్రి స్ఫూర్తితో వ్యాపారంలో రాణించి.. క్రమక్రమంగా గ్రానైట్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. క్వారీలు, గ్రానైట్ పరిశ్రమలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. లక్షల మందికి జీవనోపాధిని అందించిన వ్యక్తిగా ఆయనకు స్థానికంగా పేరుంది. గ్రానైట్ ఇండస్ట్రీ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లోని గాయత్రి గ్రానైట్ ఆర్గనైజేషన్ ఈయన ఆధ్వర్యంలో నడుస్తున్నదే. గత ఎన్నికల్లో వరంగర్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసి ఓడిన గాయత్రి రవి.. ఆ తర్వాత టిఆర్ఏస్ లో చేరారు. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటింపబడ్డారు. -
విజయసాయిరెడ్డి: పార్లమెంట్లో సరైన గళం.. అందుకే రెండోసారి
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి మరోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధం అయ్యారు. పార్లమెంట్లో తెలుగు రాష్ట్రం తరపున బలమైన గళం వినిపించిన నేతగా ఈయనకి పేరుంది. అందుకే రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావించింది.. అభ్యర్థిగా ప్రకటించింది. విజయసాయిరెడ్డి.. పూర్తి పేరు వేణుంబాక విజయసాయిరెడ్డి. 1957 జూలై 1న నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి గ్రామంలో జననం. చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ చేసిన విజయసాయిరెడ్డి.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. రెండుసార్లు వరుసగా టీటీడీ సభ్యుడిగా ఎన్నికయ్యారాయన. వైఎస్సార్సీపీ తరపున ఏకగ్రీవంగా ఇంతకు ముందు రాజ్యసభకు ఎన్నికై.. 22వ తేదీ జూన్ 2016 నుంచి 21 జూన్ 2022 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభలో 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు విజయసాయి రెడ్డి(64). అంతేకాదు.. రూల్స్, పెట్రోలియం & సహజ వాయువు స్టాండింగ్ కమిటీలోనూ సభ్యుడిగా పని చేశారు. తెలుగు రాష్ట్రాల హక్కుల సాధన కోసం, నిరసనల సమయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి రెండోసారి అవకాశం దక్కింది ఇప్పుడు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే తనకు ప్రాధాన్యతాంశమని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడమే తన విధి అని పేర్కొన్నారు. -
బీద మస్తాన్‌రావు: వ్యాపార, రాజకీయాలతోనే కాదు..
సాక్షి, నెల్లూరు: బీసీ కోటాలో వైఎస్సార్సీపీ తరపున అభ్యర్థిగా రాజ్యసభకు ఎంపికయ్యారు బీద మస్తాన్ రావు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వ్యాపారంలో ఎదిగి.. తిరిగి రాజకీయాలతోనే రాణిస్తున్నారాయన. ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్సార్సీపీ నేత బీద మస్తాన్‌రావు.. జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జన్మించారు. విద్యార్హత.. బీకాం, సీఏ(ఇంటర్). బీసీ యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. స్థానికంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. రాజకీయాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరును పరిశీలిస్తున్నారు బీద మస్తాన్‌రావు. విద్య పూర్తయ్యాక.. చెన్నైలో ఓ ప్రముఖ హోటల్ గ్రూప్‌నకు ఫైనాన్షియల్ మేనేజర్‌గా పని చేసిన బీద మస్తాన్‌రావు.. అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. బోగోల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా మొదలుపెట్టి.. ఎమ్మెల్యేగానూ పని చేశారు. బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. 2019లో నెల్లూరు లోక్ సభ స్థానానికి పోటీ చేశారు కూడా. 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ మెంబర్‌గానూ పనిచేశారు. -
బయోడేటాలతో వద్దు.. విషయ పరిజ్ఞానంతో రండి..
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ మంగళవారం హైకోర్టు న్యాయవాదులకు తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తన వద్దకు బయోడేటాలతో రావద్దని, విషయ పరిజ్ఞానంతో రావాలని స్పష్టం చేశారు. న్యాయవాదుల వ్యవహారశైలిని బట్టే న్యాయమూర్తుల తీరు ఉంటుందన్నారు. బార్ అండ్ బెంచ్(న్యాయవాదులు–న్యాయమూర్తులు) మధ్య సహకారం ఉండాలని, అయితే అది కేసుల విషయంలో కాదని, కక్షిదారులకు న్యాయం చేసే విషయంలోనేనని తెలిపారు. ఇప్పటివరకు తాను అవినీతిని దరిచేర నీయ లేదని, దాన్ని ప్రోత్సహించడం చేయలేదన్నారు. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల విజ్ఞప్తి మేరకు జస్టిస్ రాధాకృష్ణన్ మంగళవారం మధ్యా హ్నం భోజనవిరామంలో ఆ సంఘాలు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయవాదులు సొంత శైలిని కలిగి ఉండాలి: ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. ఎవరినీ అనుకరించకుండా సొంత శైలిని కలిగి ఉండాలన్నారు. తన తల్లిదండ్రులిద్దరూ న్యాయవాదులేనని, కొందరు తనను తన తండ్రిలా, మరికొందరు తనను తన తల్లిలా ఉండాలని సూచించారన్నారు. అయితే తాను మాత్రం సొంత శైలిని ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. పెద్ద పెద్ద లా కాలేజీలు, యూనివర్సిటీల్లో చదవలేదని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడ చదివామన్నది ముఖ్యం కాదని, ఎంత కష్టపడ్డాం.. ఎంత నిబద్ధతతో పనిచేశాం.. అన్నదే ముఖ్యమని తెలిపారు. కట్ అండ్ పేస్ట్ విధానాలకు స్వస్తి పలికినప్పుడే జీవితంలో ముందుకెళ్లడం సాధ్యమవుతుందన్నారు. న్యాయవాదులు లేకుండా న్యాయమూర్తులు లేరని, వీరిద్దరి లక్ష్యం కూడా మారుమూల ఉన్న కక్షిదారులకు న్యాయం చేయడమేనన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రాధాకృష్ణన్‌ను ఇరు సంఘాల ప్రతినిధులు దుశ్శాలువాతో సత్కరించారు. -
సీవీ అంటే బాంబులు!
సాక్షి, హైదరాబాద్: కరిక్యులమ్ విటె (సీవీ) అంటే బయోడేటా అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఉగ్రవాదుల పరిభాషలో మాత్రం పేలుడు పదార్థాలు! సీడీ అంటే పిస్టల్, డీవీడీ అంటే ఏకే-47. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పేలుళ్లు సృష్టించేందుకు ఈ మెయిల్ ద్వారా కోడ్ భాషలో పంపుకునే సమాచారాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) డీ కోడ్ చేసింది. ఢిల్లీ అధికారులు ఉగ్రవాది యాసిన్ భత్కల్ను విచారించిన సమయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మెయిల్ చాటింగ్ ద్వారా పాకిస్థాన్‌లో ఉన్న ఇక్బాల్ భత్కల్, రియాజ్ భత్కల్‌తో సంబంధాలను కొనసాగించినట్లు యాసిన్ చెప్పాడు. ఈ మెయిల్ సందేశాలను పరిశీలించిన అధికారులు అవి కోడ్ భాషలో ఉండటంతో యాసిన్ వెల్లడించిన వివరాల ప్రకారం వాటిని డీ కోడ్ చేశారు. వెలుగుచూసిన వివరాలను నాంపల్లి కోర్టుకు సమర్పించారు. ఆ వివరాలను ‘సాక్షి’ సంపాదించింది. పాక్ నుంచి రియాజ్ ‘పటారాసింగ్ యట్ యాహూ డాట్‌కామ్’ మెయిల్ ఐడీతో యాసిన్‌తో నిరంతరం సంబంధాలు కొనసాగించాడు. యాసిన్ ‘బహద్దూర్ యట్ యాహూ డాట్‌కామ్’ ఐడీతో సంప్రదింపులు జరిపాడు. కరాచీ ఆపరేషన్ పేరుతో భారత్‌లో వంద పేలుళ్లకు జరిగిన కుట్రకు సంబంధించి కూడా ఉగ్ర నేతలతో యాసిన్ ఈ విధానంలోనే సంప్రదింపులు జరిపినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు ముందుకూడా మొత్తం ప్రణాళిక పూర్తయిందని, త్వరలో సంతోషకరమైన వార్త వింటారని రియాజ్‌కు యాసిన్ తెలిపాడు. ఫిబ్రవరి 21న పేలుళ్లకు సరిగ్గా ఒకరోజు ముందు కూడా చాటింగ్ జరిగింది. పేలుళ్ల తరువాత తిరిగి ఫిబ్రవరి 28న వీరు సందేశాలు పంపుకున్నారు. పేలుళ్ల ద్వారా ప్రజలను బాగా భయబ్రాంతులకు గురిచేశారంటూ యాసిన్‌కు పాకిస్థాన్ నుంచి అభినందన సందేశాలందాయి. తదుపరి పేలుళ్ల కుట్రలకు సంబంధించి కూడా యాసిన్ పాక్ ఉగ్రనేతలకు చాటింగ్ ద్వారా వివరించాడు. వంద పేలుళ్లకు సీవీ (పేలుడు పదార్ధాలు) ఇప్పటికే సిద్ధం చేసుకున్నానని చెప్పాడు. ప్రధానంగా పుణే, ముంబయి. గుజరాత్, హైదరాబాద్‌కు సంబంధించిన ప్రస్తావనలే వారి మెసేజ్‌లలో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఎక్కడెక్కడ పేలుళ్లకు కుట్రలు చేశారు? పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన రహస్య డెన్లు ఎక్కడున్నాయి? అనే సమాచారం యాసిన్ నుంచి రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ప్రాంతాలకు యాసిన్, తబ్రేజ్‌లను తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, చాటింగ్ మెసేజ్‌లలో ‘సబ్ మెరైన్’ పేరిట కొంత సమాచారం ఉండటంతో ఎన్ఐఏ దీనిపై ఆరా తీస్తోంది. ఉగ్రవాదుల కోడ్ భాషలో కొన్ని... సీవీ పేలుడు పదార్థాలు సీడీ పిస్టల్ డీవీడీ ఏకే 47 ఖల్దీ పాస్‌పోర్టు ఏజెన్సీ ఐఎస్ఐ నెవె ఎన్ఐఏ మెట్రో పుణే జి/జెజూ గుజరాత్ గావ్ ముంబై దబ్ దుబాయ్ వాగు అల్‌కాయిదా ప్రిన్స్ యాసిన్ భత్కల్ బెబొ ఇక్బాల్ భత్కల్ బీబీ ఇక్బాల్ స్నేహితురాలు సమీర్ అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అఫ్తాబ్ మోహిసిన్ చౌదరి