ప్రత్యేక నెంబర్లపైన రూ.30.49 లక్షల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ కొత్త సిరీస్ ‘టీజీ’పైన శుక్రవారం మొటి రోజే వాహనదారులు తమ క్రేజ్‌ను చాటుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఖైరతాబాద్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో ప్రత్యేక నెంబర్లపైన రూ.30.49 లక్షలు లభించింది. ‘టీజీ 09 0001’ నెంబర్ కోసం రుద్రరాజు రాజీవ్ కుమార్ అనే వాహన యజమాని బిడ్డింగ్‌లో ఏకంగా రూ.9.61 లక్షలు చెల్లించి సొంతం చేసుకోవడం గమనార్హం.
అలాగే ‘టీజీ 09 0909’ నెంబర్‌కు భవ్యసింధు ఇన్‌ఫ్రా సంస్థ రూ.2.30 లక్షలు చెల్లించి నెంబర్ దక్కించుకుంది. ‘టీజీ 09 0005’ నెంబర్ కోసం శాని్వతారెడ్డి అనే వాహన యజమాని రూ.2.21 లక్షలు చెల్లించారు. ‘టీజీ 09 0002’ నెంబర్ కోసం దుశ్యంత్ రెడ్డి అనే వాహనయజమాని రూ.1.22 లక్షలు చెల్లించారు. అలాగే ‘టీజీ 09 0369’ నెంబర్‌కు రూ.1.20 లక్షలు, ‘టీజీ 09 0007’ నెంబర్ కోసం రూ.1.07 లక్షల చొప్పున చెల్లించి సొంతం చేసుకున్నారు.
అలాగే ఆర్టీఏ బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో మొదటి రోజు ప్రత్యేక నెంబర్లపైన రూ.3.32 లక్షల ఆదాయం లభించింది. పశి్చమ మండలం టోలిచౌకి కార్యాలయంలో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో రూ.5.38 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. అలాగే సికింద్రాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో ప్రత్యేక నెంబర్లపైన రూ.8.52 లక్షలు లభించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment