RTA Act
-
Hyderabad: టీజీ 09 0001 నెంబర్‌కు రూ.9.61 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ కొత్త సిరీస్ ‘టీజీ’పైన శుక్రవారం మొటి రోజే వాహనదారులు తమ క్రేజ్‌ను చాటుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఖైరతాబాద్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో ప్రత్యేక నెంబర్లపైన రూ.30.49 లక్షలు లభించింది. ‘టీజీ 09 0001’ నెంబర్ కోసం రుద్రరాజు రాజీవ్ కుమార్ అనే వాహన యజమాని బిడ్డింగ్‌లో ఏకంగా రూ.9.61 లక్షలు చెల్లించి సొంతం చేసుకోవడం గమనార్హం. అలాగే ‘టీజీ 09 0909’ నెంబర్‌కు భవ్యసింధు ఇన్ఫ్రా సంస్థ రూ.2.30 లక్షలు చెల్లించి నెంబర్ దక్కించుకుంది. ‘టీజీ 09 0005’ నెంబర్ కోసం శాని్వతారెడ్డి అనే వాహన యజమాని రూ.2.21 లక్షలు చెల్లించారు. ‘టీజీ 09 0002’ నెంబర్ కోసం దుశ్యంత్ రెడ్డి అనే వాహనయజమాని రూ.1.22 లక్షలు చెల్లించారు. అలాగే ‘టీజీ 09 0369’ నెంబర్‌కు రూ.1.20 లక్షలు, ‘టీజీ 09 0007’ నెంబర్ కోసం రూ.1.07 లక్షల చొప్పున చెల్లించి సొంతం చేసుకున్నారు. అలాగే ఆర్టీఏ బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో మొదటి రోజు ప్రత్యేక నెంబర్లపైన రూ.3.32 లక్షల ఆదాయం లభించింది. పశి్చమ మండలం టోలిచౌకి కార్యాలయంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో రూ.5.38 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. అలాగే సికింద్రాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో ప్రత్యేక నెంబర్లపైన రూ.8.52 లక్షలు లభించినట్లు పేర్కొన్నారు. -
ఆర్టీఏలో డ్రైవింగ్ సిమ్యులేటర్లు
సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ శిక్షణలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రవాణాశాఖ ఆర్టీఏ కార్యాలయాల్లో సిమ్యులేటర్(అనుకరణ యంత్రం)లను ఏర్పాటు చేయనుంది. డ్రైవింగ్‌లో కనీస అవగాహన లేని వారికి నేరుగా వాహనం ఎక్కించి రోడ్లపై శిక్షణ ఇవ్వడం సరికాదని రవాణాశాఖ భావిస్తోంది. డ్రైవింగ్ నేర్చుకునేవాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు, పాత డ్రైవర్ల అనుభవాన్ని, మెళకువలను అంచనా వేసేందుకు వీటిని ఏర్పాటు చేయనుంది. లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ వంటి వాటి కోసం ఆర్టీఏకు వచ్చే వినియోగదారులు వీటి ద్వారా శిక్షణ పొందవచ్చు. నగరంలో ఒకటి రెండు మాత్రమే: సిమ్యులేటర్ ద్వారా శిక్షణ ఇచ్చే డ్రైవింగ్ స్కూళ్లు నగరంలో ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. మిగతా డ్రైవింగ్ స్కూళ్లన్నీ రోడ్లపైనే శిక్షణ ఇస్తున్నాయి. ఈ విధమైన శిక్షణతో సరైన నైపుణ్యం, అవగాహన లేకుండానే డ్రైవర్లుగా మారిపోతుండటంతో రహదారి భద్రత అతి పెద్ద సవాలుగా మారుతోంది. అందుకే ఆర్టీఏ కార్యాలయాలతో పాటుగా డ్రైవింగ్ స్కూళ్లలోనూ సిమ్యులేటర్లపై శిక్షణ తప్పనిసరి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏతోనే ప్రారంభం మొదట ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సిమ్యులేటర్లను ఏర్పాటు చేసి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇప్పటికే వీటి ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ పరిశీలించారు. ఆ తరువాత వీటిని మరిన్ని కేంద్రాలకు విస్తరించనున్నారు. సిమ్యులేటర్లతో దళారుల ఆటకట్టు: చాలా దేశాల్లో సిమ్యులేటర్ల ద్వారా డ్రైవింగ్ శిక్షణ తప్పనిసరి. ఆ శిక్షణలో నైపుణ్యం వచ్చాకే రోడ్డు మీద వాహనం నడిపేందుకు అనుమతిస్తారు. కానీ నగరంలోని కొన్ని డ్రైవింగ్ స్కూళ్లు వినియోగదారులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించేందుకు ఆర్టీఏ అధికారులకు, వినియోగదారులకు మధ్య దళారీలుగా వ్యవహరిస్తున్నాయి. వీటి ఏర్పాటుతో దళారీల ఆట కట్టించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇవీ ప్రయోజనాలు - డ్రైవింగ్‌లో ఎలాంటి అనుభవం లేక పోయినా సిమ్యులేటర్ల ద్వారా నేరుగా శిక్షణ పొందవచ్చు. - రహదారి భద్రతా, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన ఏర్పడుతుంది. - క్లిష్టమైన పరిస్థితుల్లో అనుసరించవలసిన మెళకువలు తెలుసుకోవచ్చు. - నేర్చుకునే వాళ్ల ప్రవర్తనను విశ్లేషించేందుకు అవకాశం ఉంటుంది. - సీనియర్ సిటిజన్లకు డ్రైవింగ్ లైసెన్సుల పునరుద్ధరణలో సిమ్యులేటర్ పరీక్ష ఉపయుక్తంగా ఉంటుంది. -
నేటి నుంచి ఈ-ఆఫీస్ సేవలు
గుంటూరు జిల్లాలో మరో నెల ఆలస్యం గుంటూరు ఈస్ట్: జిల్లాలోని పది శాఖల్లో ఈ ఆఫీస్ సేవలు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని శాఖల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఈ విధానం తీసుకొస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఎలా పని చేస్తుంది అన్ని కార్యాలయాల్లో ప్రజలు పెట్టుకునే దరఖాస్తులన్నీ స్కానింగ్ చేసి కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు. వీటిని సంబంధిత అధికారికి పంపుతారు. ఈ దరఖాస్తు కొన్ని సెకన్లకే సంబంధిత అధికారి ముందుకు వెళుతుంది. అన్ని స్థాయిల్లో ఫైలు ఎవరు ఆలస్యం చేస్తున్నారో స్పష్టంగా గుర్తించవచ్చు. ఆర్టీఏ యాక్ట్ తదితర అదనపు పనులు వేగవంతంగా పూర్తి చేయవచ్చు. దరఖాస్తుల పరిష్కారం ఏ దశల్లో ఉందో ముఖ్యమంత్రి నుంచి అన్ని స్థాయిల అధికారులు తెలుసుకోవచ్చు. జిల్లాలో ఎప్పటి నుంచి.. జిల్లాలో నేటి నుంచి పది శాఖల్లో ఈ ఆఫీసు ప్రారంభించాలని తొలుత జిల్లా అధికారులు భావించారు. కానీ డిజిటల్ సిగ్నేచర్ ఇతర సాంకేతిక కారణాలతో మరో నెల ఆలస్యమయ్యేలా ఉంది. డీఆర్వో నాగబాబు, ఈ ఆఫీస్ జిల్లా కో-ఆర్డి నేటర్ ఇప్పటికే రెవెన్యూలో ఈ ఆఫీస్ ప్రారంభమైంది. దీంతో జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం వేగవంతమైంది. కొద్ది రోజుల్లో అన్ని ఆటంకాలు అధిగమించి 10 శాఖల్లో ఈ ఆఫీస్ ప్రారంభిస్తాం. ఈ విధానంలో ఏవైనా లోటుపాట్లను మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తాం.