special number
-
Hyderabad: టీజీ 09 0001 నెంబర్‌కు రూ.9.61 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ కొత్త సిరీస్ ‘టీజీ’పైన శుక్రవారం మొటి రోజే వాహనదారులు తమ క్రేజ్‌ను చాటుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఖైరతాబాద్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో ప్రత్యేక నెంబర్లపైన రూ.30.49 లక్షలు లభించింది. ‘టీజీ 09 0001’ నెంబర్ కోసం రుద్రరాజు రాజీవ్ కుమార్ అనే వాహన యజమాని బిడ్డింగ్‌లో ఏకంగా రూ.9.61 లక్షలు చెల్లించి సొంతం చేసుకోవడం గమనార్హం. అలాగే ‘టీజీ 09 0909’ నెంబర్‌కు భవ్యసింధు ఇన్ఫ్రా సంస్థ రూ.2.30 లక్షలు చెల్లించి నెంబర్ దక్కించుకుంది. ‘టీజీ 09 0005’ నెంబర్ కోసం శాని్వతారెడ్డి అనే వాహన యజమాని రూ.2.21 లక్షలు చెల్లించారు. ‘టీజీ 09 0002’ నెంబర్ కోసం దుశ్యంత్ రెడ్డి అనే వాహనయజమాని రూ.1.22 లక్షలు చెల్లించారు. అలాగే ‘టీజీ 09 0369’ నెంబర్‌కు రూ.1.20 లక్షలు, ‘టీజీ 09 0007’ నెంబర్ కోసం రూ.1.07 లక్షల చొప్పున చెల్లించి సొంతం చేసుకున్నారు. అలాగే ఆర్టీఏ బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో మొదటి రోజు ప్రత్యేక నెంబర్లపైన రూ.3.32 లక్షల ఆదాయం లభించింది. పశి్చమ మండలం టోలిచౌకి కార్యాలయంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో రూ.5.38 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. అలాగే సికింద్రాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో ప్రత్యేక నెంబర్లపైన రూ.8.52 లక్షలు లభించినట్లు పేర్కొన్నారు. -
ఆర్టీఏ ఆన్లైన్ బిడ్డింగ్‌లో గందరగోళం
► ఇటీవల నగరంలోని ఓ ఆర్టీఏ కేంద్రం పరిధిలో కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఓ వాహనదారు తనకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం వేలం నిర్వహించే సమయానికి మొబైల్ ఫోన్‌కు ఎలాంటి సమాచారం అందకపోవడంతో పోటీలో పాల్గొనలేకపోయారు. దీంతో నచ్చిన నంబర్‌ను కోల్పోయారు. ► బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన మరో వాహనదారుకు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రధానంగా ‘9999’, ‘9’, ‘1111’, ‘6666’, ‘1234’ వంటి నంబర్లకు ఎంతో డిమాండ్ ఉంటుంది. గతంలో ఆల్‌నైన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో ఏకంగా రూ.10 లక్షల వరకు వేలంలో పోటీపడి సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నచ్చిన నంబర్లను సొంతం చేసుకొనేందుకు పెద్ద మొత్తంలోనే చెల్లించేందుకు సిద్ధపడతారు. కానీ ఆన్లైన్ బిడ్డింగ్‌లో పోటీ తగ్గుముఖం పట్టినట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ప్రత్యేక నంబర్లపై నిర్వహించే ఆన్లైన్ బిడ్డింగ్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బిడ్డింగ్‌లో ప్రదర్శించే నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోటీలో పాల్గొనలేకపోతున్నట్లు వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని నంబర్లపై ఎలాంటి పోటీలు కూడా నిర్వహించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాహనదారులు తమకిష్టమైన నంబర్ల కోసం రూ.లక్షలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆన్లైన్లో సరైన సమాచారం లేకపోవడంతో ఇందులో పాల్గొనలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్) అప్పుడలా.. ► మూడేళ్ల క్రితం అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రత్యేక నంబర్లకు ప్రత్యక్షంగా వేలం నిర్వహించేవారు. వాహనదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మధ్యాహ్నం 3 గంటలకు పోటీ నిర్వహించేవారు. ఈ పోటీలో వాహనదారులంతా స్వయంగా పాల్గొనేందుకు అవకాశం ఉండడంతో ఏ వాహనదారు ఎంత మొత్తానికి బిడ్డింగ్‌లో పాల్గొని నంబర్‌ను సొంతం చేసుకున్నాడనేది స్పష్టంగా తెలిసిపోయేది. (చదవండి: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు) ► మరోవైపు నంబర్ల బిడ్డింగ్ నిర్వహణలో పారదర్శకత కోసం అధికారులు సైతం ఎలాంటి దాపరికానికి తావు లేకుండా బహిరంగంగా వేలం నిర్వహించేవారు. దీంతో ప్రత్యేక నంబర్లపైనే రవాణా శాఖకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం లభించింది. నంబర్ల సీరిస్‌లో ‘9’ అంకెతో మొదలయ్యే ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రతి ప్రత్యేక నంబర్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. రూ.30 వేల ఫీజు ఉన్న నంబర్లకు పోటీలో రూ.5 లక్షలు డిమాండ్ ఉండేది. సింగిల్ నైన్, ఆల్‌నైన్స్ కోసం ప్రతి సిరీస్‌లో కనీసం 10 మంది వాహనదారులు పోటీపడేవారు. (చదవండి: ఐఐటీ హైదరాబాద్.. నియామకాల్లో జోరు) ఇప్పుడిలా.. ► ప్రత్యేక నంబర్లపై నిర్వహించే బిడ్డింగ్‌ను మూడేళ్ల క్రితం ఆన్‌లైన్‌లోకి మార్చారు. మొదట హైదరాబాద్ ఆర్టీఏలో అమలు చేసి ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు విస్తరించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది. ► సాంకేతిక వైఫల్యాల కారణంగా వాహనదారులకు సకాలంలో సరైన సమాచారం లభించడం లేదు. దీంతో ఎక్కువ మంది పోటీలో పాల్గొనలేకపోతున్నారు. దీనిపై కొంతమంది వాహనదారులు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. -
నెంబర్ ఫ్యాన్సీ.. డిమాండ్ క్రేజీ..!
టీఎస్09 ఎఫ్బీ 9999... ఈ నెంబర్‌కు రవాణాశాఖ నిర్ణయించిన ఫీజు రూ.50వేలు. కానీ ఇటీవల నిర్వహించిన వేలంలో దీనికి అనూహ్యమైన పోటీ ఏర్పడింది. 10మంది వాహనదారులు రూ.లక్షలు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. ఒక వాహనదారుడు ఏకంగా రూ.9.25లక్షలు చెల్లించి ఈ నెంబర్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఒక్క నెంబర్ మాత్రమే కాదు... నచ్చిన నెంబర్ కోసం వాహనదారులు ఎంత చెల్లించేందుకైనా వెనుకాడడం లేదు. ఒక్కో నెంబర్ కోసం కనీసం 5 నుంచి 10మంది పోటీ పడుతున్నారు. నాలుగైదేళ్ల క్రితం పెద్దగా ఆదరణ లేని నెంబర్లకు సైతం ఇప్పుడు అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో : ఇటీవల నిర్వహించిన వేలంలోనే టీఎస్09 ఎఫ్‌సీ 0001 నెంబర్ కోసం ఒక సంస్థ రూ.6.66లక్షలు చెల్లించింది. అలాగే టీఎస్09 ఎఫ్‌సీ 0005 నెంబర్ కోసం స్పేస్ టైమ్ ఇంటీరియర్ అనే మరో సంస్థ రూ.5.06 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. ప్రత్యేక నెంబర్లపై వేలంపాటలు నిర్వహించిన ప్రతిసారి ఆర్టీఏకు దాదాపు రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. సంఖ్యాశాస్త్రంపై, జ్యోతిషంపై ఉండే విశ్వాసం, కొన్ని నెంబర్లతో అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకం వాహనదారుల్లో ఈ మేరకు ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు ఇదే ఆర్టీఏకు ఆదాయాన్నిస్తోంది. రెండేళ్ల క్రితం ఇదే ఆల్‌నైన్స్ నెంబర్ టీఎస్09 ఈఎల్ 9999 కోసం సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రూ.10.50లక్షలు చెల్లించాడు. అన్ని రకాల ప్రత్యేక నెంబర్లపై నిర్వహించే వేలంపాటలతో ఆర్టీఏకు ప్రతిఏటా రూ.25కోట్ల వరకు ఆదాయం లభిస్తున్నట్లు అంచనా. ఒక్క ఖైరతాబాద్ కార్యాలయంలోనే కాదు.. నగరంలోని అన్ని చోట్ల ప్రత్యేక నెంబర్లకు ఎంతో క్రేజ్ ఉంది. లగ్జరీ వాహనాలు కొనుగోలు చేసిన వారు తమకు నచ్చిన నెంబర్ కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. వీటికే డిమాండ్... 9, 1, 999, 9999, 786, 6, 666, 1111 తదితర నెంబర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఒక్క ‘ఆల్‌నైన్స్’ మాత్రమే కాదు... తమకు నచ్చిన నెంబర్ల కోసం వాహనదారులు రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ఫ్యాన్సీ నెంబర్లు, అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నెంబర్లుగా భావించే కొన్ని రకాల వాహన రిజిస్ట్రేషన్ నెంబర్లకు పోటీ బాగా ఉంది. బీఎండబ్ల్యూ, ల్యాండ్‌రోవర్, ల్యాండ్‌క్రూజర్, ఆడి తదితర ఖరీదైన వాహనాలే కాదు... బైక్‌ల కోసం కూడా వాహనదారులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నిర్వహించిన వేలంపాటల్లో ఇలాంటి నెంబర్లపై సుమారు రూ.25 కోట్ల ఆదాయం లభించినట్లు అంచనా. వాహనదారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘9’తో మొదలయ్యే ఖైరతాబాద్ కార్యాలయంలోనే డిమాండ్ ఎక్కువగా ఉంది. హోదా.. అదృష్టం అదృష్ట సంఖ్యలుగా భావించే నెంబర్ల కోసం కొందరు పోటీకి దిగితే... సామాజిక హోదా కోసం, పేరు ప్రతిష్టల కోసం మరికొందరు ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పడుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, సినిమాలు, రాజకీయాలు, పరిశ్రమలు తదితర విభిన్న రంగాలకు చెందిన వాహన యజమానులు ‘లక్కీ’ నెంబర్ల కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరిస్ ప్రారంభమవుతుంది. మొత్తం నెంబర్లలో 2500 వరకు ఫ్యాన్సీ నెంబర్లు ఉంటాయి. ఒక్కో నెంబర్‌కు సగటున 5 నుంచి 10 మంది పోటీకి వస్తుండగా... నచ్చిన నెంబర్లు లభించని వాళ్లు 3 నెలల నుంచి 6నెలల వరకు కూడా పడిగాపులు కాయడం గమనార్హం. కేవలం ఫ్యాన్సీ కోసం కాకుండా కొన్ని నెంబర్లతో అదృష్టం బాగా కలిసొస్తుందనే నమ్మకం కూడా ఈ క్రేజీకి కారణమే. జ్యోతిషులు ఒక్కొక్క నెంబర్‌ను ఒక గ్రహంతో, వాటి కదలికలతో సరి చూసి భవిష్యత్తును, మానసిక స్వభావాలను అంచనా వేస్తారు. అలా తమ స్వభావానికి తగిన నెంబర్లను వాహనదారులు ఎంపిక చేసుకుంటున్నారు. ఆ రకంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వంటి ప్రతి సింగిల్ నెంబర్‌కు ఒక లక్షణం ఉంటుంది. ఉదాహరణకు ‘1’ నాయకత్వానికి, ‘2’ శాంతస్వభావానాకి నిదర్శనం. గురుగ్రహంతో పోల్చే ‘3’ వల్ల చక్కటి తెలివితేటలు, జ్ఞానం లభిస్తాయని నమ్మకం. ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తారు. ఈ నెంబర్ వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం. ఇక ప్రతి ఒక్కరూ ఇష్టపడే నెంబర్ ‘9’. కుజగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో విజేతలుగా, తిరుగులేని నాయకులుగా ఎదగాలని కోరుకునేవాళ్లు, పోటీ మనస్తత్వం, పోరాడే తత్వం ఉన్నవాళ్లు ఈ నెం»బర్ను ఇష్టపడుతారు. ఎన్టీఆర్‌తో ప్రారంభం... మొదట్లో ఈ నెంబర్లకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. ఇప్పుడు రూ.లక్షల్లో డిమాండ్ ఉన్న ‘9999’ వంటి నెంబర్లు రెండు దశాబ్దాల క్రితం రూ.వేలల్లో లభించేవి. 1980లలో అయితే కేవలం రూ.500లకు ఈ నెంబర్లను కేటాయించేవారు. ఎలాంటి పోటీ ఉండేది కాదు. రాజకీయరంగ ప్రవేశం చేసిన ఎన్టీరామారావుతో ఈ నెంబర్‌కు క్రేజ్ వచ్చేసింది. అప్పట్లో ఎన్టీఆర్ 27, 999, 9999 వంటి నెంబర్లకు ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో అందరూ అదే బాటలో నడిచారు. బాగా డిమాండ్ పెరిగింది. ఆల్నైన్స్తో పాటు కొంతకాలంగా వాహనదారులు 6666 నెంబర్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెంబర్‌ను తన అదృష్ట సంఖ్యగా భావించడంతో మిగతా వాహనదారులపైన ప్రభావం పడింది. దీంతో ఈ నెంబర్‌కు ప్రస్తుతం రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వరకు పోటీ ఉంది. రాజకీయ నాయకులు, వ్యాపార రంగ ప్రముఖులు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నెంబర్లే బహుమతులు... ఇటీవల కాలంలో చాలామంది వినియోగదారులు తమ కుటుంబసభ్యులకు వాహనాలను బహుమానంగా అందజేయడమే కాదు... వారి పుట్టిన రోజు కలిసొచ్చే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్లను ఎంపిక చేసుకొని పోటీకి వస్తున్నారు. 1313 (తేరా తేరా) అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీనిని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. 5121 అనే నెంబర్‌ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు. 143, 214, 8045 వంటి నెంబర్లకు ఎంతో క్రేజీ ఉంది. లగ్జరీ వాహనాలు పెరగడంతోనే... గత రెండేళ్లుగా ఫ్యాన్సీ నెంబర్లకు అనూహ్య స్పందన వస్తోంది. లగ్జరీ వాహనాల వినియోగం బాగా పెరగడం ఇందుకు కారణం. ప్రతిఏటా 10వేలకు పైగా ఖరీదైన కార్లు విదేశాల నుంచి వచ్చేస్తున్నాయి. అలాగే రూ.50లక్షల విలువైన బైక్‌లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఈ వాహనాల స్థాయికి తగినట్లుగానే వినియోగదారులు నెంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. – పాండురంగ్‌నాయక్, జేటీసీ, హైదరాబాద్ -
పశువుల లెక్క పక్కాగా
కరీంనగర్‌అగ్రికల్చర్: పశువుల లెక్కను పక్కాగా తేల్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సర్వే చేయనున్నారు. ప్రతి పశువుకూ ఓ విశిష్ట నంబర్ కేటాయించనున్నారు. పశుగణనకు 105 మంది ఎన్యుమరేటర్లతోపాటు పర్యవేక్షణకు సూపర్వైజర్లు, సిబ్బందికి శిక్షణ పూర్తిచేశారు.. కేంద్ర ప్రభుత్వం నుంచి అతి త్వరలో షెడ్యూల్ వచ్చే అవకాశముండగా.. అందుకు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈనెల చివరి వారంనుంచి రెండునెలల్లో సర్వే పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఐదేళ్లకోసారి సర్వే దేశవ్యాప్తంగా ప్రతి ఐదేళ్లకోసారి పశుగణను చేపడతారు. రాష్ట్రంలో కూడా పశుగణన జరగాల్సి ఉండగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీతో జాప్యం జరిగింది. సర్వేలో పశువులు, గొర్రెలు, మేకలు, కుక్కలు, గాడిదలు, గుర్రాలు, పందులు, కోళ్లు, బాతులు, ఒంటెలతో సహా ప్రతి పెంపుడు జీవి కూడా లెక్కలోకి రానుంది. 2011లో నిర్వహించిన పశుగణన లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 83,732 తెల్లజాతి పశువులు, 1000801 నల్లజాతి పశువులు, 4.10 లక్షల గొర్రెలు, 83,104 మేకలు, 8,696 పందులు, 4,48,484 నాటు కోళ్లు, 15,20,215 పౌల్ట్రీ కోళ్లు లెక్కలో ఉన్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ కారణంగా ఆవులు, ఎద్దులు, జెర్సీ ఆవుల సంఖ్య తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కుర్మలకు అందిస్తున్న సబ్సిడీ గొర్రెల పథకంతో జిల్లాలో గొర్రెల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.. జిల్లాలో ఇప్పటికే 4606 యూనిట్లు (96,726 గొర్రెలు) పంపిణీ చేశారు. మరో 31 వేల గొర్రెలు పునరుత్పత్తి జరిగినట్లు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. పందులు, మేకలు, పౌల్ట్రీ పరంగా కోళ్ల సంఖ్య కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఆన్లైన్లో గణన.. 2017లో జరగాల్సిన పశుగణన ఈ యేడాది ఆలస్యంగా చేపట్టబోతున్నారు. జిల్లాలోని గోపాల మిత్ర, పశుమిత్రతో పాటు నిరుద్యోగులను కలుపుకుని 105 మంది ఎన్యుమరేటర్లను ఎంపిక చేశారు. వీరికి ట్యాబ్లెట్లు అందిస్తున్నారు.. పర్యవేక్షణకు మరో 30 మంది శాఖ అధికారులు, సిబ్బందిని సూపర్వైజర్లుగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. సర్వే సమయంలో వివిధ సమస్యల పరిష్కారానికి ’ ఈ కేంద్రం’ ద్వారా పర్యవేక్షణకు ఒక నోడల్ అధికారితో పాటు ఇద్దరు పారా సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. 2 నెలల పాటు ఇంటింటి సర్వే నిర్వహించి లెక్క తేల్చనున్నారు. గతంలో జరిగిన పశుగణన మ్యానువల్‌గా కాగితాలపై రాయగా.. ఈసారి ఒక విశిష్ట గుర్తింపు నంబర్‌ను కేటాయిస్తూ వివరాలు నమోదు చేస్తారు. జంతు రక్షణకు చర్యలు. పశుగణనలో భాగంగా పశువులతోపాటు యజమానులు, వారి ఆదాయం, విద్యార్హతలు, కోళ్ల ఫారాల సంఖ్యనూ ఆరాతీసి లెక్కించనున్నారు. ఇందులో పశువులు, గొర్రెలు, మేకలు, కుక్కలు, గాడిదలు, గుర్రాలు, పందులు, కోళ్లు, బాతులు, ఒంటెలతో పాటు ప్రతి పెంపుడు జీవుల లెక్క కంప్యూటర్లో నిక్షిప్తం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో పశువుల అభివృద్ధికి కచ్చితమైన కేటాయింపులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకల జనుల సర్వే, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, సకల నేరస్తుల సర్వే, మత్య్సకారుల సర్వేలతో దేశంలోనే సాంకేతికతను ఉపయోగించిన ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు పొందింది.. పశుగణనతో ప్రభుత్వం జంతు సంరక్షణకు అవసరమైన నిధుల కేటాయింపు, వైద్య సదుపాయాలకు కావాల్సిన సామగ్రి కొనుగోలు, వాటి సంతాన ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టేందుకు ఈ గణన కీలకం కానుంది. పశుగణనకు సిద్ధం పశుగణనకు సర్వం సిద్ధం చేశాం. కేంద్ర ప్రభుత్వం నుంచి షెడ్యూల్ రాగానే గణన చేపడుతాం. అందుకు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల ఎంపికతోపాటు శిక్షణ కూడా పూర్తి చేశాం. ప్రభుత్వం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విశిష్ట గుర్తింపు సంఖ్యతో పాటు పశువుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేసి గణన చేయాలనే ఆలోచనతో కొంత జాప్యం జరిగింది. గణన ద్వారా పూర్తిస్థాయి సమాచారం సేకరించడంతో నిధుల కేటాయింపు, వాటి పరిరక్షణ సులభతరం కానుంది.-ఎన్.విక్రమ్‌కుమార్,జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి -
ఐటెం సాంగ్‌కు కళ్లుచెదిరే రెమ్యూనరేషన్!
నటి క్యాథరిన్ ట్రెసా టాలీవుడ్లో దూసుకుపోతోంది. 2016లో ’సరైనోడు’ వంటి సూపర్‌హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఇప్పుడు మంచి అవకాశాలే వస్తున్నాయి. ’ఖైదీ నంబర్ 150’ వంటి ప్రతిష్టాత్మకమైన సినిమా నుంచి తప్పుకున్నా.. ఈ భామ కెరీర్‌కు పెద్దగా రిస్క్ ఎదురుకాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న తాజా సినిమాలో ఓ స్పెషల్ నంబర్ కోసం క్యాథరిన్‌ను తీసుకున్నారు. లావిష్‌గా తెరకెక్కిస్తున్న ఈ ఐటెంసాంగ్ కోసం ఈ అమ్మడికి కళ్లుచెదిరే రీతిలో రూ. 65 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది. క్యాథరిన్‌కు ఇది నిజంగా చాలా పెద్దమొత్తమే. పూర్తి సినిమా చేసిన ఇంతస్థాయిలో ఆమెకు రెమ్యూనరేషన్ దక్కేది కాదని, కానీ ఒక్క పాట కోసమే రూ. 65 లక్షలు ఇస్తుండటం పెద్ద విషయమని అని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. క్యాథరిన్ మంచి డ్యాన్సర్ కావడం.. పాటకు సరిపోయే అందచందాలు తనకు ఉండటంతోనే పెద్దమొత్తంలో చెల్లించారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వల్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.