సాక్షి, హైదరాబాద్: నాన్ బాస్మతి(ముడి) బియ్యంపై కేంద్రం 20 శాతం సుంకం విధించడం వల్ల తెలంగాణ రైతాంగానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని దక్షిణ భారత రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయస్థాయిలో డిమాండ్‌ఉన్న తెలంగాణ సోనా మసూరి రకాల బియ్యం ఎగుమతులపై ఈ ప్రభావం అధికంగా పడుతుందన్నారు.
శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పంజాబ్, హరి యాణాల్లో మాత్రమే పండే బాస్మతి బియ్యాన్ని ఎలాంటి పన్ను లేకుండా ఎగుమతికి అవకాశం ఇచ్చి, ముడిబియ్యంపై పన్నులు విధించడంలో ఉన్న ఆంతర్యమేమిటో అర్థం కావడంలేదన్నారు. నూకల ఎగుమతిని నిషేధించడం వల్ల కూడా నష్టపోయేది రైతేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment