తాంసి: తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దు లోని పెన్ గంగ పరీవాహక ప్రాంతం వెంట పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. మహా రాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం నుంచి వచ్చిన పులి పెన్‌గంగ ఒడ్డున మహారాష్ట్ర వైపున్న గ్రామాల్లో సంచరిస్తూ శుక్రవారం రాత్రి కనిపించింది.
నదికి అవతల మహారాష్ట్ర వైపు చిన్నార్లి గ్రామానికి సమీపంలోని పంటచేల వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ కనిపించగా.. వాహనాల డ్రైవర్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. నదికి అటువైపు సంచరిస్తున్న పులి నది దాటి తెలంగాణ వైపు వచ్చే అవకాశం లేకపోలేదు. గత ఫిబ్రవరిలో ఒకపులి, మూడు పిల్లలతో భీంపూర్ మండలంలోని పలు గ్రామాల శివారులో సంచరించడం తెలిసిందే. ఈ క్రమంలో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment