
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పొలిటికల్ వార్ మరోసారి హీటెక్కింది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు హంగామా చేశారు.
హైదరాబాద్‌లోని అరవింద్ ఇంటిని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అరవింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం, వారందరూ అరవింద్ ఇంట్లోకి దూసుకెళ్లి అద్దాలు, ఫర్నీచర్, ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో, పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కాగా, ఎంపీ అరవింద్ ఇంట్లో లేని సమయంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment