
సాక్షి, సూర్యాపేట: పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర పేలుడు సంభవించింది. వెల్డింగ్ చేస్తున్న క్రమంలో ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ శబ్దంతో ట్యాంకర్ పేలడంతో స్థానికులు పరుగులు పెట్టారు. మృతులను అశోక్, అర్జున్‌గా పోలీసులు గుర్తించారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లాలోని ఉప్పలపహాడ్ వద్ద రోడ్డు డివైడర్‌ను మినీ డీసీఎం ఢీకొట్టింది. దీంతో డీజిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి ఉండగా అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment