welding
-
ట్రాక్‌మ్యాన్ సమయస్ఫూర్తి.. రైలుకు తప్పిన పెను ప్రమాదం
న్యూఢిల్లీ: ట్రాక్‌మ్యాన్ సమయస్ఫూర్తి వల్ల పెద్ద రైలు ప్రమాదం తప్పింది. కొంకణ్ రైల్వే డివిజన్ పరిధిలోని కుమటా, హొన్నావర్ మధ్య రైల్వే లైన్లో పట్టాల మధ్య వెల్డింగ్ తొలగిపోయింది. శుక్రవారం విధుల్లో ఉన్న ట్రాక్‌మ్యాన్ మహదేవ్.. ట్రాక్ జాయింట్లో వెల్డింగ్ పోయి ఉండటాన్ని గమనించాడు.అయితే అదే మార్గంలో తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తుండటాన్నిఆపడానికి మహదేవ్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరగా పట్టాల వెంట పరుగులు తీయడంతో గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు.. అతడి సమయస్ఫూర్తిని అభినందించారు. నగదు బహుమతి అందిచారు. -
Welding Tanks: వెల్డింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలిన ట్యాంకర్
సాక్షి, సూర్యాపేట: పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర పేలుడు సంభవించింది. వెల్డింగ్ చేస్తున్న క్రమంలో ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ శబ్దంతో ట్యాంకర్ పేలడంతో స్థానికులు పరుగులు పెట్టారు. మృతులను అశోక్, అర్జున్‌గా పోలీసులు గుర్తించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదం సూర్యాపేట జిల్లాలోని ఉప్పలపహాడ్ వద్ద రోడ్డు డివైడర్‌ను మినీ డీసీఎం ఢీకొట్టింది. దీంతో డీజిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి ఉండగా అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. -
కొనసాగుతున్న ట్రాక్ మరమ్మతు
తక్కువ వేగంతో వెళ్తున్న రైళ్లు కేసముద్రం : స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని జమలాపురం వద్ద గురువారం రైలు పట్టాలపై ఆరు చోట్ల మెత్తబడి గుంతలుగా ఏర్పడిన విష యం తెలిసిందే. సాయంత్రం వరకు ఆ పట్టాలను కట్‌చేసి, మరోపట్టాను బిగించి రైళ్లను నె మ్మదిగా నడిపించారు. కాగా, బిగించిన పట్టాల మధ్య వెల్డింగ్ పనులను చేపట్టకపోవడంతో శుక్రవారం డౌన్‌లైన్‌లో వెళ్లే రైళ్ల వేగాన్ని తగ్గించి, 30 కిలోమీటర్ల స్పీడుతోనే పంపించారు. శని వారం నుంచి యథావిధిగా తగిన స్పీడుతో(100-120 కిలో మీటర్లు) నడిపించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఇలా పట్టాలు మెత్తబడి గుంతలుగా ఏర్పడటం, ఇదే తొలిసారని రైల్వే సిబ్బంది తెలిపారు. గూడ్సురైలు వెనక చక్రాలు బ్రేకులు పట్టేయడం, ముందు చక్రాలు తిరగడం మూ లంగా, అదే విధంగా ఎండతీవ్రత ఎక్కువగా ఉండటం వల్లే ఇలా పట్టాలు మెత్తబడి, గుంతలు పడినట్లుగా రైల్వే సిబ్బంది భావిస్తున్నారు. -
ప్రమాదవశాత్తు బస్సు దగ్ధం
కడప : కడప జిల్లాలోని విజయదుర్గా కాలనీలో సోమవారం ప్రమాదవశాత్తు బస్సు దగ్ధమైంది. నగరంలోని విజయదుర్గాకాలనీలో ఉన్న వెల్డింగ్ షాప్‌లో మైదకూరుకు చెందిన వీఆర్ కాలేజీ బస్సుకు వెల్డింగ్ చేస్తున్నారు. వెల్డింగ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో బస్సుకు నిప్పంటుకుని కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.5లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో వెల్డింగ్ చేస్తున్న మెకానిక్ మహబూబ్ బాషాకు స్పల్ప గాయాలయ్యాయి. మెకానిక్ షెడ్ పూర్తిగా కాలిపోయింది. కాగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
నీటితో మంట.. వెల్డింగ్!
మంటలు ఆర్పేందుకు ఏం కావాలి? నీళ్లుంటే సరిపోతుంది. మరి మంట పుట్టించాలంటే... వంటచెరకు మొదలుకొని అనేక పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. కానీ... యూరప్‌కు చెందిన ఓ పరిశోధక బృందం మాత్రం తాము నీళ్లతోనే మంటలు సృష్టిస్తామని, తద్వారా వేర్వేరు పరిశ్రమల్లో జరిగే వెల్డింగ్ పనులకయ్యే ఖర్చు తగ్గిస్తామని అంటోంది. అనడమే కాదు.. ఓ నమూనా యంత్రాన్ని తయారు చేసి వెల్డింగ్ పనులు చేసే వారికి పంపిణీ చేసి పరీక్షిస్తోంది కూడా. నీళ్లతో మంటలేమిటబ్బా అన్న సందేహం వద్దు. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన ఇంధనం హైడ్రోజన్, ఆక్సిజన్లు కలిస్తేనే నీరవుతుందని మనకు తెలుసు. కాకపోతే నీటిలోని ఈ రెండు మూలకాలను వేరు చేసి వా డుకోవడంలోనే ఇబ్బందులున్నాయి. ఎలక్ట్రోలైజేషన్ అన్న ప్రక్రియ ప్లాటినమ్ వంటి ఖరీదైన పదార్థాలను వాడుతుంది. యూరోపియన్ పరిశోధక బృందం మాత్రం ఖరీదైన పదార్థాలకు ప్రత్యామ్నాయాలు గుర్తించింది. ఫలితంగా కరెంట్ సాయంతో నడిచే పోర్టబుల్ ఎలక్ట్రొలైజర్ పరికరం ‘సేఫ్ ఫ్లేమ్’ పుట్టింది. సంప్రదాయ వెల్డింగ్‌లో వాడే అసిటలీన్, ప్రొపేన్ వంటి వాటితో పోలిస్తే సేఫ్ఫ్లేమ్ దాదాపు 20 రెట్లు చౌక మాత్రమే కాకుండా చాలా సురక్షితమైందని పరిశోధకులు అంటున్నారు. హైడ్రోజన్, ఆక్సిజన్లు రెండూ ఎలక్ట్రోలైజర్ గొట్టం చిట్టచివరి భాగంలో మాత్రమే కలిసి మంట పుట్టిస్తాయి కాబట్టి... దీన్ని వాడటమూ సులువేనన్నది వీరి అంచనా.