కొనసాగుతున్న ట్రాక్ మరమ్మతు
తక్కువ వేగంతో వెళ్తున్న రైళ్లు
కేసముద్రం : స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని జమలాపురం వద్ద గురువారం రైలు పట్టాలపై ఆరు చోట్ల మెత్తబడి గుంతలుగా ఏర్పడిన విష యం తెలిసిందే. సాయంత్రం వరకు ఆ పట్టాలను కట్‌చేసి, మరోపట్టాను బిగించి రైళ్లను నె మ్మదిగా నడిపించారు. కాగా, బిగించిన పట్టాల మధ్య వెల్డింగ్ పనులను చేపట్టకపోవడంతో శుక్రవారం డౌన్‌లైన్‌లో వెళ్లే రైళ్ల వేగాన్ని తగ్గించి, 30 కిలోమీటర్ల స్పీడుతోనే పంపించారు.
శని వారం నుంచి యథావిధిగా తగిన స్పీడుతో(100-120 కిలో మీటర్లు) నడిపించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఇలా పట్టాలు మెత్తబడి గుంతలుగా ఏర్పడటం, ఇదే తొలిసారని రైల్వే సిబ్బంది తెలిపారు. గూడ్సురైలు వెనక చక్రాలు బ్రేకులు పట్టేయడం, ముందు చక్రాలు తిరగడం మూ లంగా, అదే విధంగా ఎండతీవ్రత ఎక్కువగా ఉండటం వల్లే ఇలా పట్టాలు మెత్తబడి, గుంతలు పడినట్లుగా రైల్వే సిబ్బంది భావిస్తున్నారు.