local railway station
-
స్విమ్మింగ్ పూల్ గా మారిన రైల్వే స్టేషన్
ముంబై: కొద్దిరోజులుగా ఆగకుండా కురుస్తున్న వానలకు నవీ ముంబైలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్లోకి నీళ్లు చేరాయి. దీంతో స్థానిక యువత అక్కడ నీటిలో జలకాలాడుతూ వీడియో తీసి వర్షం పడితే ఆ లోకల్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఏంటనేది కళ్ళకు కట్టారు. రుతుపవనాల రాకతో కొద్ది రోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదనీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా నవీ ముంబైలోని ఉరాన్ లోకల్ రైల్వే స్టేషన్ ఐతే స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తూ నిండుగా నీళ్లు చేరాయి. దీంతో యువత అందులో హాయిగా జలకాలాడారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడెక్కడో విహరిస్తోంది. నూతనంగా నిర్మిస్తున్న ఈ రైల్వే స్టేషన్లో నీరు లీక్ అవుతుండడంతోనే ఇంతగా నీరు చేరిందంటున్నారు స్థానికులు. పైగా ఇక్కడి డ్రైనేజి వ్యవస్థ అయితే అత్యంత అధ్వానంగా ఉండడంతో నీరు బయటకు పోయే మార్గమే లేదంటున్నారు స్థానికులు. ఈ వీడియో చూసైనా సిగ్గు తెచ్చుకోండని అధికారులని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. नवीन नेरूळ - उरण लोकल रेल्वे स्टेशन बोकडविरा @CMOMaharashtra @PMOIndia @AshwiniVaishnaw @Dev_Fadnavis @mieknathshinde #uran_local_navi_mumbai pic.twitter.com/mb0Wp5fF1j — Jeetendra N. Thale (@JeetendraThale) July 4, 2023 ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! -
కొనసాగుతున్న ట్రాక్ మరమ్మతు
తక్కువ వేగంతో వెళ్తున్న రైళ్లు కేసముద్రం : స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని జమలాపురం వద్ద గురువారం రైలు పట్టాలపై ఆరు చోట్ల మెత్తబడి గుంతలుగా ఏర్పడిన విష యం తెలిసిందే. సాయంత్రం వరకు ఆ పట్టాలను కట్చేసి, మరోపట్టాను బిగించి రైళ్లను నె మ్మదిగా నడిపించారు. కాగా, బిగించిన పట్టాల మధ్య వెల్డింగ్ పనులను చేపట్టకపోవడంతో శుక్రవారం డౌన్లైన్లో వెళ్లే రైళ్ల వేగాన్ని తగ్గించి, 30 కిలోమీటర్ల స్పీడుతోనే పంపించారు. శని వారం నుంచి యథావిధిగా తగిన స్పీడుతో(100-120 కిలో మీటర్లు) నడిపించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఇలా పట్టాలు మెత్తబడి గుంతలుగా ఏర్పడటం, ఇదే తొలిసారని రైల్వే సిబ్బంది తెలిపారు. గూడ్సురైలు వెనక చక్రాలు బ్రేకులు పట్టేయడం, ముందు చక్రాలు తిరగడం మూ లంగా, అదే విధంగా ఎండతీవ్రత ఎక్కువగా ఉండటం వల్లే ఇలా పట్టాలు మెత్తబడి, గుంతలు పడినట్లుగా రైల్వే సిబ్బంది భావిస్తున్నారు. -
ఇకపై మగవాళ్లకూ ‘చార్జి’!
సాక్షి, ముంబై: నగరంలోని కొన్ని ప్రముఖ లోకల్ రైల్వే స్టేషన్లో మూత్ర విసర్జనకు పురుషుల నుంచి రూపాయి చార్జీ వసూలు చేయాలని సెంట్రల్ ైరె ల్వే నిర్ణయం తీసుకుంది. దీన్ని అక్టోబరు ఆఖరు నుంచి అమలు చేయనున్నారు. తొలుత సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గంలోని ప్రముఖ 20 స్టేషన్లలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మూత్ర విసర్జనకు పురుషుల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయడం లేదు. కాని మరుగు దొడ్డి వాడినందుకు మాత్రం పురుషుల నుంచి రెండు రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే మహిళల నుంచి మరుగుదొడ్డితోపాటు మూత్ర విసర్జనకు కూడా రూపాయి వసూలు చేస్తున్నారు. దీనిపై అనేకసార్లు మహిళ సంఘాలు గళమెత్తాయి. కాని ఎవరూ అంతగా పట్టిం చుకోలేదు. కాగా ఇంత తక్కువ ఆదాయంతో రైల్వే స్టేషన్లలో పురుషుల, మహిళల మరుగుదొడ్లు, పురుషుల మూత్రశాలలు ఇలా మూడు రకాల మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడం కాంట్రాక్టర్లకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో అవి ఎప్పుడు చూసినా అపరిశుభ్రంగా, దుర్గంధంతో దర్శనమిస్తున్నాయి. ఆదాయం లేకపోవడంతో నాణ్యమైన సేవలు అందించేందుకు ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు. దీంతో కాంట్రక్టర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారం లేకుండా పోయింది. అవి పరిశుభ్రంగా ఉండాలంటే ఆదాయం రావాలి. కాని నిత్యం వేల సంఖ్యలో మూత్రశాలలు వినియోగించే పురుషుల నుంచి రూపాయి వసూలు చేస్తే వాటిని శుభ్రంగా ఉంచడం, నిర్వహణ పనులు చేపట్టడం లాంటివి సాధ్యమవుతుందని రైల్వే భావించింది. ఒకవేళ అవి అపరిశుభ్రంగా ఉంటే కాంట్రాక్టర్ను నిలదీసేందుకు లేదా చర్యలు తీసుకునేందుకు రైల్వేకు అధికారం కూడా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు ఆసక్తిగల కాంట్రాక్టర్ల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఈ నిర్ణయానికి కాంట్రాక్టర్ల నుంచి భారీగా స్పందన వస్తుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ‘శివారు ప్రాంతాలైన కర్జత్, కసారా, పన్వేల్ లాంటి దూరప్రాంతాలనుంచి నిత్యం లక్షలాది మంది ఉద్యోగులు నగరానికి వస్తారు. కనీసం రెండు, రెండున్నర గంటలపాటు లోకల్ రైలులో కూర్చున్న ప్రయాణికులకు రైలు దిగిన తర్వాత మూత్ర ం రావడం సహజమే. అందుకు స్టేషన్లో ఉన్న మూత్రశాలలను వినియోగించక తప్పదు. ఇప్పడు ఉచితంగా ఉపయోగించినప్పటికీ వచ్చే నెల నుంచి రూపాయి చెల్లించక తప్పదు. ఈ చార్జీని కేవలం ప్రముఖ, రద్దీ స్టేషన్లలో మాత్రమే వసూలు చేయనున్న’ట్లు అధికారులు చెప్పారు. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, వ్యతిరేకతను బట్టి మళ్లీ తుది నిర్ణయం తీసుకుంటామని రైల్వే అధికార వర్గాలు స్పష్టం చేశాయి.