ముషీరాబాద్/చైతన్యపురి: పరీక్షల వాయిదాపై జేఎనీ్టయూలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. డీఎస్సీ వాయిదాతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి పరీక్షలు నిర్వహించాలని, గురుకుల ఉద్యోగాలను భర్తీ చేయా లని గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఇప్పటికే నిరుద్యోగ అభ్యర్థులు మండిపడుతున్నారు. తాజా గా సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో విద్యార్థులు శనివా రం రాత్రి ఆందోళనకు దిగారు.
సిటీ సెంటర్ లైబ్రరీలో స్వచ్ఛందంగా సమావేశమైన నిరుద్యోగ అభ్యర్థులు భారీ ప్రదర్శనగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. అక్కడి నుండి నేరు గా అశోక్ నగర్ క్రాస్ రోడ్స్‌కు వచ్చి బైఠాయించా రు. ఒక్కసారిగా వందలాదిమంది రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన పోలీసులు రోడ్డుకు ఇరువైపులా రహదారులను మూసివేసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
వుయ్ వాంట్ జస్టిస్ సీఎం డౌన్ డౌన్ అంటూ అంటూ నిరుద్యోగ అభ్యర్థులు అర్ధరాత్రి వరకు నినాదాలు చేశారు. సీఎం వ్యాఖ్యలు సరికాదంటూ అటు దిల్‌సుఖ్‌నగర్‌లోని రాజీవ్ చౌక్‌లోనూ శనివారం రాత్రి 10 గంటల నుంచి డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. అర్ధరాత్రి దాటినా ఆందోళన కొనసాగుతోంది.
నిరుద్యోగుల మొర ఆలకించండి: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగుల మొర ఆలకించాలని మాజీమంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. భేషజాలకు పోకుండా.. వారి జీవితాలు, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలన్నారు. గ్రూప్స్ రాసే అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలిచి వారి బాధ, డిమాండ్లు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.
నిరుద్యోగ యువతను రెచ్చగొట్టేలా, కించపరిచే విధంగా మాట్లాడి అభాసుపాలు కావొద్దని రేవంత్‌కు హితవు పలికారు. పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం ఫలించక పోగా, మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు.
ఒకటో తేదీన వేతనాల చెల్లింపు ఉత్తమాటే..: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామనే మాటలు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. 13తేదీ వచ్చినప్పటికీ మోడల్ స్కూల్ రెగ్యులర్ టీచర్స్ జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శనివారం ఒక ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment