![Within 24 Hours Completed RUB In Mahaboob Nagar - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/26/RUB-Mahaboob-Nagar.gif.webp?itok=yR5qaKc1)
మహబూబ్‌నగర్ పట్టణంలో పూర్తయిన రైల్వే భూగర్భ బ్రిడ్జి
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రం హనుమాన్‌పుర పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే రైల్వే గేట్ (62వ గేట్) సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణం చేపట్టారు. యుద్ధప్రాతిపదికన కేవలం 24 గంటల్లో రైల్వే భూగర్భ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 6 నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు రైల్వే అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం విశేషం.
పెద్ద పెద్ద క్రేన్‌ల సహాయంతో అండర్ బ్రిడ్జిలను దింపి గంటల వ్యవధిలోనే ఏర్పాటు చేశారు. కాపలా ఉన్న రైల్వే గేట్‌లను తీసివేయడంలో భాగంగా రైల్వే అండర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా పలు రైల్వే అండర్ బ్రిడ్జిలను తక్కువ సమయంలోనే ఏర్పాటు చేశారు. రైల్వే అండర్ బ్రిడ్జితో త్వరలో ఈ రైల్వేగేటు గుండా వెళ్లే వాహనదారులకు సమయం ఆదా కానుంది.
Comments
Please login to add a commentAdd a comment