Within 24 hours
-
రౌడీమూకపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించొద్దని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో కావలిలో ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసు శాఖ 14 మంది నిందితులను గుర్తించడంతోపాటు ఏడుగురిని 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం గమనార్హం. నిందితులకు అధికార వైఎస్సార్సీపీతో ఏమాత్రం సంబంధం లేదని, వారిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునేందుకు విపక్ష టీడీపీ – జనసేన వేసిన ఎత్తుగడలు పారలేదు. పరారీలో ప్రధాన నిందితుడు ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై రౌడీమూకల దాడిని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దాడికి పాల్పడ్డవారిని ఏమాత్రం ఉపేక్షించకుండా తక్షణం కఠిన చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసు శాఖ దాడి దృశ్యాల వీడియో ఫుటేజీని పరిశీలించి 14 మంది నిందితులను గుర్తించింది. కావలి – తుమ్మలపెంట మార్గంలో రాష్ట్రం దాటేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు నిందితులను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బండి విల్సన్, పుట్టా శివకుమార్‌రెడ్డి, షేక్ ఖాజావలి, కుప్పాల వంశీ, షేక్ కలీమ్ చోటు, షేక్ ఇలియాజర్, షేక్ బాజీలను అరెస్ట్ చేసినట్టు ఆదివారం ప్రకటించారు. 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఏడుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌తోపాటు మిగిలినవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాతోపాటు అన్ని చోట్లా విస్తృతంగా గాలిస్తున్నారు. గతంలోనే నేర చరిత్ర.. రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉంది. కావలి ప్రాంతంలో ఈ ముఠా ఎన్నో ఏళ్లుగా రౌడీయిజం, సెటిల్మెంట్లు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. అమాయకులను మోసగిస్తున్న నిందితులపై గతంలోనే పోలీసులు సస్పెక్ట్ షీట్లు తెరిచారు. బండి విల్సన్‌పై 14 కేసులు, శివకుమార్‌రెడ్డిపై 8 కేసులు ఉండటం గమనార్హం. మిగిలిన ఐదుగురిని వీరి అనుచరులుగా గుర్తించారు. ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులపై పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 143, 341, 332, 307, 323, 427 రెడ్‌విత్ 34 సీఐపీ సెక్షన్ల కింద కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రాజకీయ రాద్ధాంతం డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని అధికార వైఎస్సార్ సీపీతోపాటు అంతా ఖండించినా టీడీపీ – జనసేన రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడిన నిందితులతో అధికార పార్టీకి ఎలాంటి సంబంధం లేకున్నా లోకేశ్ సహా టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. 24 గంటల్లోనే వాస్తవాలు బహిర్గతం కావడంతో విపక్ష నేతలు తోక ముడిచారు. ఆర్టీసీ యూనియన్ల హర్షం ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించిన విధానం, ఏడుగురు నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం పట్ల ఆర్టీసీ యూనియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. ఈ ఉదంతం వెలుగులోకి రాగానే నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ సంఘాలకు ఎండీ భరోసానిచ్చారు. సుధీర్ ముఠా మోసాలపై ఫిర్యాదు చేయాలి వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించాం. కావలికి చెందిన ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ కుమారుడి నిశ్చితార్థం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లడంతో పరారయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. త్వరలోనే మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేస్తాం. రూ.1.5 కోట్ల విలువైన రెండు వాహనాలను జప్తు చేశాం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. సుధీర్ ముఠా చేతిలో మోసపోయిన వారు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నాం. – తిరుమలేశ్వరరెడ్డి, ఎస్పీ, నెల్లూరు జిల్లా -
24గంటల్లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రం హనుమాన్‌పుర పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే రైల్వే గేట్ (62వ గేట్) సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణం చేపట్టారు. యుద్ధప్రాతిపదికన కేవలం 24 గంటల్లో రైల్వే భూగర్భ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 6 నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు రైల్వే అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం విశేషం. పెద్ద పెద్ద క్రేన్ల సహాయంతో అండర్ బ్రిడ్జిలను దింపి గంటల వ్యవధిలోనే ఏర్పాటు చేశారు. కాపలా ఉన్న రైల్వే గేట్లను తీసివేయడంలో భాగంగా రైల్వే అండర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా పలు రైల్వే అండర్ బ్రిడ్జిలను తక్కువ సమయంలోనే ఏర్పాటు చేశారు. రైల్వే అండర్ బ్రిడ్జితో త్వరలో ఈ రైల్వేగేటు గుండా వెళ్లే వాహనదారులకు సమయం ఆదా కానుంది. -
24 గంటల్లో లక్షకు పైగా రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా రోగులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఇటీవల కొద్ది రోజుల నుంచి రికవరీల సంఖ్య భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఏకంగా 1,01,468 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 44,97,867కు చేరుకుంది. మరోవైపు కొత్త కేసుల సంఖ్య కూడా ఇటీవల వస్తున్న రోజూవారీ కేసులతో పోలిస్తే తగ్గాయి. మంగళవారం 75,809 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 55,62,663కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,053 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 88,935 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,75,861 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 17.54 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 80.86 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.60 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 21 వరకు 6,53,25,779 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం మరో 9,33,185 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 344 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారతే బెటర్.. నాలుగు రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటున్నాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న మొత్తం కేసుల్లో భారత్ నుంచి 17.7 శాతం కేసులు ఉన్నాయని చెప్పారు. అయితే కోలుకున్న వారిలో 19.5 శాతం ఉన్నారని చెప్పారు. అమెరికా నుంచి 22.4 శాతం కేసులు ఉండగా, అక్కడ కోలుకున్న వారి శాతం 18.6గా ఉందని చెప్పారు. బ్రెజిల్‌తో పోల్చినప్పటికీ, భారత్ నుంచే రికవరీలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కోవిడ్–19 టాస్క్‌ఫోర్స్ సభ్యుడు వీకీ పాల్ మాట్లాడుతూ.. రానున్న పండుగ సీజన్లో ప్రజలంతా భౌతిక దూరం పాటించడం వంటివి మరచిపోరాదని చెప్పారు. -
వలసలను తక్షణం ఆపాలి
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిపై ఫేక్ న్యూస్‌తో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా నివారించాలని, కచ్చితమైన సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌ను 24 గంటల్లోగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ అనంతరం వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నగరాల నుంచి ఇళ్లకు మరలడంపై దాఖలైన రెండు పిల్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, జస్టిస్ నాగేశ్వరరావుల బెంచ్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..‘శిక్షణపొందిన కౌన్సెలర్లను రప్పించి షెల్టర్ హోమ్‌లలో ఉన్న వలస కార్మికుల్లో ఆందోళనను పోగొట్టాలి. పోలీసులకు బదులుగా వలంటీర్లకే షెల్టర్ల నిర్వహణ బాధ్యతలు చూడాలి. కార్మికులకు పరీక్షలు చేపట్టి, అవసరమైతే క్వారంటైన్లో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేంద్రం.. సత్వర చర్యలతో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేశామని, ఫేక్‌న్యూస్ కారణంగా ప్రజల్లో తలెత్తిన భయాందోళనలతో పరిస్థితులు నియంత్రించలేనంతగా చేయిదాటి పోయాయని తెలిపింది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ జాడలు కనిపించలేదని, నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రతి 10 మంది వలస కార్మికుల్లో ముగ్గురు సొంతూళ్లకు వెళ్లడంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఉచితంగా కోవిడ్ పరీక్షకు ఆదేశించండి దేశంలోని పౌరులందరికీ కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్ష ఉచితంగా చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉచితంగా పరీక్ష చేసేలా కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలంటూ లాయర్ శశాంక్ డియో సుధి పిటిషన్ దాఖలు చేశారు. తమకున్న రోగాన్ని నిర్ధారణ చేసుకొనేందుకు సాధారణ పౌరులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే అక్కడ భారీగా ఫీజు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని స్పష్టంచేశారు. -
‘అత్యాచారం’పై 24 గంటల్లో ఎఫ్ఐఆర్
* నిందితులపై చట్ట ప్రకారం చర్యలు * విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ * ఎస్సీ, ఎస్టీలకు భద్రత కల్పిస్తామని హామీ ఇందూరు : ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు జరిగిన 24 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వివరాలను ఎస్పీతో పాటు కలెక్టరేట్‌కు పంపాలని కలెక్టర్ యోగితా రాణా అధికారులను ఆదేశించారు. చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని, బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రగతి భవన్లో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలపై జరిగిన అత్యాచార సంఘటనలు, నమోదైన కేసులపై చేపట్టిన చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార సంఘటనలకు సంబంధించి 62 కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయని, మరో 25 సంఘటనలు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించేందుకు రూ. 15 వేల చొప్పున 2014లో 50 మందికి, 2015లో 16 మందికి ప్రభుత్వంనుంచి ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. ప్రతివారం నమోదైన కేసుల వివరాలను డీఎస్పీల వారీగా అందజేయాలని ఆదేశించారు. ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాలో 25 శాతం విడుదల చేయనున్నట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చార్జిషీట్లు దాఖలు చేయాలని, దాని ప్రతులను మండల స్థాయి జెండర్ కమిటీలకు పంపాలని సూచించారు. సామాజిక వివక్షపై ఆందోళన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 69 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కుల బహిష్కరణ, దేవాలయాల్లోకి ప్రవేశాల నిషేధం తదితర సామాజిక వివక్షలు కొనసాగడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఫిర్యాదుపై స్పందించాలని పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులను, అట్రాసిటీ కమిటీ సభ్యులను కోరారు. ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను కల్పించేందుకు ఇక నుంచి ప్రతి నెలా 30వ తేదీన పౌరహక్కుల దినోత్సవంగా జరుపనున్నట్లు తెలిపారు. అన్ని మండలాల్లో రెవెన్యూ, పోలీసు, ఇతర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎస్సీ, ఎస్టీ గ్రామాలు, కాలనీలలో పర్యటిస్తామన్నారు. అవగాహన సదస్సులు నిర్వహిస్తాం అలాగే సాంఘిక సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇటు ఇంటర్, డిగ్రీ విద్యార్థినులకు ఎస్సీ, ఎస్టీల హక్కుల సంరక్షణకు ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, ఏర్పాటు చేసిన యంత్రాంగం గురించి అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 714 ఎకరాల భూ పంపిణీ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్తోందని, ఈనెల 30వ తేదీ నాటిని లక్ష్యాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సామాజిక వివక్షను నిర్మూలించేందుకు కల్పించిన చట్టపరమైన హక్కుల గురించి పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సూచించారు. సమాజంలో ఏ వర్గానికి చెందిన ప్రజలు కూడా వివక్షకు గురి కారాదని, అదే సమయంలో ఏ వ్యక్తి కూడా అన్యాయంగా శిక్షించబడరాదని పేర్కొన్నారు. కక్షలతో కావాలనే అట్రాసిటీ కేసులు పెట్టిన చాలా సంఘటనలున్నాయని, అవి కూడా విచారించి నిజానిజాలు తేల్చాలని సూచించారు. చట్టాన్ని తప్పుడు పనులకు ఉపయోగించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ‘గుర్తింపు’ ఇవ్వాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార సంఘటనలపై ఏడాదిలో మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నా అలా చేయడం లేదని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తద్వారా కేసులు నీరుగారిపోతున్నాయన్నారు. కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో ఎస్పీ చంద్రశేఖరరెడ్డి, ఏఎస్పీ ప్రతాప్‌రెడ్డి, ఏజేసీ రాజారాం, ఐకేపీ పీడీ వెంకటేశం, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విజయ్ కుమార్, కమిటీ సభ్యులు సాయిలు, నాగభూషణం, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.