● అర్బన్ పార్కు పనుల్లో అవినీతి జలగలపై చీఫ్ కన్జర్వేటర్ సీరియస్ ● విచారణకు ఫ్లయింగ్ స్క్వాడ్ నియామకం ● రోడ్డు కొలతలు, మట్టి తవ్విన ప్రదేశాల పరిశీలన ● ఎంబీ రికార్డుల స్వాధీనం ● ‘సాక్షి’ కథనంతో కొనసాగుతున్న దర్యాప్తు
బషీరాబాద్: తాండూరు సమీపంలోని అంతారం – గొట్లపల్లి అర్బన్ పార్కులో జరిగిన అక్రమాలపై రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ దర్యాప్తునకు ఆదేశించారు. డీఎఫ్‌ఓ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ముగ్గురు ప్రత్యేక అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్‌ను నియమించింది. డీఎఫ్‌ఓ వీ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో రేంజర్ విష్ణువర్ధన్‌రెడ్డి, డిప్యూటీ రేంజర్ ప్రసన్నకుమార్, ఎస్‌ఓ శ్రీకాంత్ రంగంలోకి దిగారు. గురువారం వీరు అర్బన్ పార్కులో పర్యటించింది. తాండూరు మండల బీట్ ఆఫీసర్ మల్లయ్య, సెక్షన్ అధికారి ఫీర్యానాయక్ కాంట్రాక్టర్లుగా మారి రూ.16 లక్షల నిధులతో చేపట్టిన వాకింగ్ పాత్ పనుల్లో భారీ అక్రమాలకు పాల్పడినట్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. విచారణ అధికారులు వాకింగ్ పాత్‌ను కొలతలు తీశారు. అలాగే మొరం కోసం చెట్లను తొలగించిన ప్రదేశాన్ని పరిశీలించి కొలతలు తీసుకున్నారు. అనంతరం తాండూరు రేంజర్ కార్యాలయానికి చేరుకొని పనుల అంచనాల కాపీలు, ఎంబీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి దర్యాప్తు అధికారి శ్రీనివాస్‌రావు నిరాకరించారు. చీఫ్ కన్జర్వేటర్‌కు నివేదిక అందజేస్తామని వెల్లడించారు. దర్యాప్తు అధికారుల వెంట తాండూరు ఎఫ్‌ఆర్‌ఓ శ్రీదేవి సరస్వతి ఉన్నారు.
దర్యాప్తు ముమ్మరం
దర్యాప్తు ముమ్మరం