
ప్లాస్టిక్ భూతం.. అడ్డుకట్టతో ఆరోగ్యం
స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేస్తున్న మహిళలు, ర్యాలీలో పాల్గొన్న మేయర్ హరివెంకటకుమారి, కలెక్టర్ హరేందిర ప్రసాద్, ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్
ఏయూక్యాంపస్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని మేయర్ జి.హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. బీచ్‌రోడ్డులోని కాళీమాత ఆలయం వద్ద శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. క్యాన్సర్ వంటి వ్యాధులు రావడానికి ప్లాస్టిక్ ప్రధాన కారణంగా నిలుస్తోందని, ఇటువంటి వాటికి పూర్తిగా స్వస్తి పలకాలని కోరారు. ప్లాస్టిక్ సంచుల్లో వేడి ఆహారం ప్యాకింగ్ చేయడం, వాటిని తినడం ప్రమాదకరమన్నారు. కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెలా ఒక ప్రత్యేక నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి ప్లాస్టిక్ వస్తువుల క్రయ విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, దాడులు నిర్వహించి అమ్మే వారిపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అనంతరం ర్యాలీని జిల్లా ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ ప్రారంభించారు. వంద అడుగుల వస్త్రంతో చేసిన బ్యానర్ పట్టుకుని మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజల చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. వస్త్రంతో చేసిన సంచులను పంపిణీ చేశారు. జీవీఎంసీ అదనపు కమిషనర్లు సోమన్నారాయణ, వర్మ, రమణ, మూర్తి, సీఎంవో నరేష్, వివిధ జోనల్ కమిషనర్లు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ భూతం.. అడ్డుకట్టతో ఆరోగ్యం
Comments
Please login to add a commentAdd a comment