నేడు విశాఖకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
రేపటి నుంచి ప్రాక్టీస్
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అక్షర్ పటేల్ తన జట్టుతో కలిసి సోమవారం విశాఖపట్నం చేరుకోనున్నారు. విశాఖలోని వైఎస్సార్ స్టేడియాన్ని తమ రెండో హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న డీసీ ఈ సీజన్‌ను ఇక్కడే ప్రారంభించనుంది. చాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్ జట్టులోని డీసీ సభ్యులంతా వారి ఇంటి నుంచి నేరుగా విశాఖ చేరుకుంటారు. మంగళవారం నుంచి వైఎస్సార్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటారు. గతంలో పంజాబ్ తరఫున ఆడిన అక్షర్ 2016లో హాట్రిక్ సాధించాడు. 2020లో రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ట్రోఫీ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖలో జరిగే తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ)తో తలపడనుంది. హెడ్ కోచ్ హేమంగ్ బదాని, సహాయ కోచ్ మాథ్యూ, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ పర్యవేక్షణలో అక్షర్ పటేల్, ఇతర ఆటగాళ్లు మంగళవారం నుంచి నెట్స్‌లో సాధన చేస్తారు. జట్టులో స్టార్క్, చమీరా వంటి విదేశీ బౌలర్లు, డ్యూ, బ్రూక్ వంటి బ్యాటర్లు, కేఎల్ రాహుల్, ఫెరీరా వంటి వికెట్ కీపర్లు ఉన్నారు. దేశవాళీ క్రికెట్‌లో సెంచరీలతో చెలరేగిపోయిన కరుణ్ నాయర్‌తో పాటు పోరెల్, స్టబ్స్, అశుతోష్, కుల్దీప్ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొంటారు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన జట్టుతో ఈ నెల 22న విశాఖ చేరుకోనున్నారు. గత సీజన్‌లో రిషబ్ డీసీకి కెప్టెన్‌గా ఉన్నారు. ఎల్‌ఎస్‌జీ 23న నెట్స్‌లో ప్రాక్టీస్ చేయనుంది. డీసీ, ఎల్‌ఎస్‌జీ మధ్య తొలి మ్యాచ్ ఈ నెల 24న విశాఖలో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment