
180 కిలోల గంజాయి పట్టివేత
పెందుర్తి: ఒడిశా నుంచి నాసిక్‌కు తరలిస్తున్న గంజాయిని టాస్క్‌ఫోర్స్, పెందుర్తి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. సీఐ కె.వి సతీష్‌కుమార్ తెలిపిన వివరాలివి. మినీ వ్యాన్‌లో 180 కిలోల గంజాయిని ఒడిశా నుంచి అరకు మీదుగా నగరం వైపు తరలిస్తున్న సమాచారం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు పెందుర్తి మండలం రాజయ్యపేట సమీపంలో కాపు కాశారు. మినీ వ్యాన్‌ను అడ్డుకుని అందులో పరిశీలించగా గంజాయి పట్టుబడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. మినీ వ్యాన్‌తో పాటు రెండు బైక్‌లు, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రైల్వే స్టేషన్ వద్ద..
ఒడిశా రాష్ట్రం పడువా గ్రామం నుంచి నగరానికి గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పెందుర్తి రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. కేరళ కొట్టాయంకు చెందిన ఎస్.పి షరీఫ్ అలియాస్ అదుర్ ఒడిశా నుంచి నాలుగున్నర కిలోల గంజాయిని బ్యాగ్‌లో పట్టుకుని నగరానికి వస్తున్నాడు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద కాపు కాసి అతడ్ని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.
ఐదుగురు నిందితుల అరెస్ట్, మినీ వ్యాన్, రెండు బైక్‌లు స్వాధీనం
మరో కేసులో నాలుగున్నర కిలోల గంజాయితో వ్యక్తి అరెస్ట్