ఇంటెలిజెచర్స్‌తో నియంత్రణ సోల్‌సెన్స్‌తో బాడీ ట్రాకింగ్
విశాఖ విద్య: ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే ఎలాంటి అసాధ్యాలనైనా సుసాధ్యం చేయవచ్చునని నిరూపిస్తున్నారు ఆంధ్రా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థినులు. సరికొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలవైపు దూసుకెళుతున్నారు. తమ మేథథస్సుకు పదునుపెట్టి, సమాజానికి ఉపయోగకరమైన ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు.
ఇంటెలిజెచర్స్ అంటే...
సులభమైన చేతి సంజ్ఞలతో బల్బులు, ఫ్యాన్లు వంటి విద్యుత్ పరికరాలను నియంత్రించగల గృహ ఆటోమేషన్ వ్యవస్థ. దీనికి వాయిస్ కమాండ్‌లు, స్విచ్‌ల అవసరం ఉండదు. మీడియా పైప్ ద్వారా సంజ్ఞలను గుర్తించి, ఆర్డుయినో, రిలే బోర్డు ద్వారా పరికరాలను నియంత్రిస్తుంది.
ఎవరికి ఉపయోగం?
ఈ వ్యవస్థ వల్ల ముఖ్యంగా వృద్ధులకు, కదలికల్లో ఇబ్బందులున్న వారికి ఉపయోగం. ఈ ప్రాజెక్టును ప్రదీప్తి, నవ్య, కృపారాణి, చందన కేవలం రూ.3వేల లోపే పూర్తి చేశారు.
ఇవీ ప్రాజెక్టులు..
యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ (ఏయూసీఈడబ్ల్యూ) కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన నాలుగో సంవత్సరం విద్యార్థులు ‘ఇంటెలిజెచర్స్...సోల్‌సైన్స్’ అనే రెండు కొత్త ప్రాజెక్టులను రూపొందించారు. ఏయూసీఈడబ్ల్యూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.పద్మశ్రీ ప్రోత్సాహంతో విభాగాధిపతులు డాక్టర్ బి.ప్రజ్ఞ, డాక్టర్ బి.ఎస్తేర్ సునంద మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టులను రూపొందించారు.
సైగలతో నియంత్రణకు వినియోగించే పరికరం
●
ఏయూసీఈడబ్ల్యూ విద్యార్థినుల కొత్త ఆవిష్కరణలు
మరిన్ని ప్రయోగాలవైపు అడుగులు
ఆంధ్ర వర్సిటీ ఆచార్యుల తోడ్పాటు
ఇంటెలిజెచర్స్‌తో నియంత్రణ సోల్‌సెన్స్‌తో బాడీ ట్రాకింగ్
ఇంటెలిజెచర్స్‌తో నియంత్రణ సోల్‌సెన్స్‌తో బాడీ ట్రాకింగ్


