మూర్తి యాదవ్ నోరు అదుపులో పెట్టుకో..
మహారాణి పేట: జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ హెచ్చరించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేటర్ మూర్తి యాదవ్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడే మూర్తి యాదవ్‌కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ మూర్తి యాదవ్‌ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలన, 11 నెల ల కూటమి పాలన గురించి ప్రజలను అడిగితే చెబుతారని, బావిలో కప్పలా మా పాలన బాగుందని కూటమి నేతలు, నాయకులు అంటే సరిపోదన్నారు. కూటమి పాలనలో మోసాలు, దౌర్జన్యాలు, మహిళలపై దాడులను ప్రజలు చూస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ పాలనలో విశాఖలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన 15 ఏళ్ల పాలనలో విశాఖలో జరిగిన అభివృద్ధి గురించి చర్చిద్దామా అని ఆల్ఫా కృష్ణ సవాల్ విసిరారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ హెచ్చరిక


