ఆస్తి పన్ను వసూళ్లలో స్టేట్ రికార్డ్
సూర్యప్రభ వాహనంపై సింహాచలేశుడు
10లో
● రూ.510 కోట్లు వసూలు చేసిన అధికారులు
● జీవీఎంసీకి ఉత్తమ అవార్డు
మహారాణిపేట: గత (2024–25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఆస్తి, ఖాళీ జాగా పన్నుల వసూళ్లలో రూ.510 కోట్లు వసూలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.సురేష్ కుమార్ గురువారం ఈ అవార్డును జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మకు అందించారు. శుక్రవారం షీల్డ్‌ను కలెక్టర్/జీవీఎంసీ కమిషనర్ హరేందిర ప్రసాద్‌కు అదనపు కమిషనర్ సోమన్నారాయణ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నగరప్రజలు ఆస్తిపన్ను సకాలంలో చెల్లించి సహకరించడంతోనే ఈ అవార్డు లభించిందన్నారు. పన్ను వసూళ్లలో జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ), రెవెన్యూ అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉందని తెలిపారు.
ఆస్తి పన్ను వసూళ్లలో స్టేట్ రికార్డ్


