
పర్యాటక ప్రాంతాలకు క్యూ
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వీఎంఆర్‌డీఏ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీఎంఆర్‌డీఏ పరిధిలోని పర్యాటక పార్కులు, ప్రాంతాలకు ఉచిత ప్రవేశం కల్పించడంతో నగరవాసులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీచ్ రోడ్డులోని ప్రధాన ఆకర్షణలైన టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం, హెలికాప్టర్ మ్యూజియం, కురుసుర సబ్‌మైరెన్ మ్యూజియంల వద్ద సందర్శకులు బారులు తీరారు. పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా ఈ ప్రాంతాలను సందర్శించి ఆనందించారు. దీంతో బీచ్ రోడ్డు ప్రాంతం సందర్శకులతో సందడిగా మారింది. –ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

పర్యాటక ప్రాంతాలకు క్యూ