
కూటమి అరాచకాలకు ‘డిజిటల్ బుక్’తో బుద్ధి చెబుతాం
సాక్షి, విశాఖపట్నం: అధికార మదంతో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల అరాచకాలకు తగిన బుద్ధి చెప్పేందుకే తమ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ‘డిజిటల్ బుక్’ను తీసుకొచ్చారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు స్పష్టం చేశారు. శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, మాజీ మేయర్ హరి వెంకట కుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌తో కలిసి కేకే రాజు ఈ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. కేకే రాజు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ‘రెడ్ బుక్’ పేరిట వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడి యా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించి వేఽధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ డిజిటల్ బుక్ వారికి చట్టబద్ధంగా శిక్షిస్తుందని ఆయన హెచ్చరించారు. అక్రమంగా పెట్టిన ప్రతి కేసుకూ ఈ డిజిటల్ బుక్ సమాధానంగా ఉంటుందని, చర్యకు ప్రతిచర్య అనేది తమ నాయకుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్‌లో పొందుపరిచారన్నారు. వైఎస్సార్‌సీపీలో ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందనేదానికి ఈ డిజిటల్ బుక్ ఒక నిదర్శనమని కేకే రాజు పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కోలా గురువులు, రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, జిల్లా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు బోని శివరామకృష్ణ, సునీల్, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, బర్కత్ అలీ, పులగం కొండారెడ్డి, సేనాపతి అప్పారావు, సకలభక్తుల ప్రసాద్ రావు, కర్రి రామి రెడ్డి, బొండా ఉమా మహేశ్వర రావు, మారుతీ ప్రసాద్, వాసుపల్లి యల్లాజీ, జీలకర్ర నాగేంద్ర, దేవరకొండ మార్కెండేయులు, నీలి రవి, పార్టీ మాజీ చైర్మన్లు పిల్లా సుజాత సత్యనారాయణ, అల్లంపల్లి రాజుబాబు, మాజీ సీఎస్‌సీ సభ్యులు డాక్టర్ జహీర్ అహ్మద్, కార్పొరేటర్లు రెయ్యి వెంకటరమణ, ఉమ్మడి స్వాతి స్వాతి, అనిల్ కుమార్ రాజు కటారి, సాధి పద్మ రెడ్డి , బిపిన్ కుమార్ జైన్, శశికళ, డివిజన్ కమిటి సభ్యులు కేఆర్ పాత్రుడు, పల్లా దుర్గారావు, సుబ్రహ్మణ్యం, ఉమ్మడి దాస్, భయ్యవరపు రాధ, జీవీడబ్ల్యూ జోసెఫ్, పామేటి బాబ్జీ, రమణి రెడ్డి, శ్రీనివాస రెడ్డి పులగం, పలివెల ఈశ్వరి, విజయ్ భాస్కర్, కాళిదాసు రెడ్డి, మంచా నాగ మల్లేశ్వరి, తిరుమలరావు, మౌలికా రెడ్డి, సీరట్ల శ్రీనివాస్, గర్భపు అనిల్ శర్మ, బంగారు భవానీ శ్రీదేవి వర్మ, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.