జాతీయ కబడ్డీ పోటీలకు శశికుమార్
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న కబడ్డీ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారుడు అర్హత సాధించాడు. ఈనెల 20 నుంచి 23 వరకు కటక్‌లో జరగనున్న సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలకు విజయనగరం జిల్లాకు చెందిన శశికుమార్ ఎంపికయ్యాడు. ఈ క్రీడాకారుడు గత నెలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో జరగనున్న పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. శశికుమార్ ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ఐవీపీ రాజు, అధ్యక్షుడు రంగారావు, కార్యదర్శి కేవీ ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మణరావు, ట్రెజరర్ శివకుమార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment