విందులో విష సంస్కృతి
చర్యలు లేవు
ప్లాస్టిక్ వినియోగం ఏదో ఒక రూపంలో ప్రజలను వెంటాడుతోంది. పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా దారి మళ్లించి ప్లాస్టిక్‌భూతం ప్రజల మధ్యకు వస్తోంది. అధికారులు ప్లాస్టిక్ నిషేధంపై క్షేత్రస్థాయిలో బాధ్యత వహించాలి, ప్రతి ఒక్క ఉద్యోగికి ప్లాస్టిక్ నిషేధంలో భాగస్వామ్యం కల్పించాలి.
ఆర్‌వీజే నాయుడు,
రాజాం పర్యావరణ పరిరక్షణ కమిటీ కన్వీనర్,
చర్యలు తీసుకుంటున్నాం
రాజాం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాం. తొలుత షాపుల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమం చేస్తున్నాం. ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పుల తయారీ పరిశ్రమలపై దృష్టిసారిస్తాం. వాటితో పాటు వాటర్ ప్లాంట్ల వద్ద కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తాం. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆయా ప్రాంతాల్లోని సచివాలయాల్లో ఫిర్యాదుచేయాలి.
సీహెచ్. ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, రాజాం
● విచ్చలవిడిగా ప్లాస్టిక్ బఫే ప్లేట్ల వినియోగం
● పుట్టగొడుగుల్లా పరిశ్రమల ఏర్పాటు
● కలుషితమవుతున్న ఆహారపదార్థాలు
● ప్రమాదకరంగా పరిశ్రమల పరిసర
ప్రాంతాలు
● పట్టించుకోని అధికార యంత్రాంగం
● వాటర్ ప్లాంట్లుల్లోనూ అదే పరిస్థితి
రాజాం: పట్టణాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న విందు భోజనాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. శుభకార్యక్రమాలు, పెళ్లిళ్లు, పూజలు, పేరంటాళ్ల పండగ వంటి కార్యక్రమాల్లో నిర్వహించే సామూహిక భోజన కార్యక్రమాల్లో కొత్త సంస్కృతి ప్రారంభమైంది. గతంలో ఈ భోజనాల్లో అరటి ఆకులు, అడ్డాకులు(విస్తర్లు) వినియోగించేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ బఫే పేట్లు వినియోగంలోకి వచ్చాయి. వాటిని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా వాటిలో భోజనాలు చేసే వ్యక్తులు క్యాన్సర్ వంటి భయానక రోగాలబారిన పడుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. వాటితో పాటు ఆయా కార్యక్రమాల వద్ద వినియోగిస్తున్న వాటర్ ప్యాకెట్లు కూడా ప్రమాదకర వ్యాధులను ప్రజలకు అంటగడుతున్నాయి. ఆయా ఫ్యాక్టరీల వద్ద ప్లాస్టిక్ కవర్లు పోగులుగా ఏర్పడి, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.
అంతా కలుషితమే
ఇప్పుడు ప్రతి గల్లీలో పేపర్ ప్లేట్ల పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటికోసం వినియోగిస్తున్న ముడిసరుకు చాలా ప్రమాదకరంగా ఉంది. వాటితయారీ అనంతరం వచ్చిన వ్యర్థాలు ఆయా పరిశ్రమల పక్కన పొలాల్లో, చెరువుల్లో పడేయడంతో ఆయా ప్రాంతాలు కలుషితమవుతున్నాయి. వాటిని అన్నసంతర్పణలు, భోజనాల్లో వినియోగించిన తరువాత ప్లేట్లను ప్రధాన రహదారులు, చెరువుల పక్కన వదిలేయడంతో ఆయా ప్రాంతాలు ప్రమాదకర రసాయనాలతో కలుషితంగా మారుతున్నాయి. మానవుని ఆరోగ్యంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఈ మిగిలిన ఆహార పదార్థాలు తినడం ద్వారా పశువులు సైతం రోగాల బారిన పడుతున్నాయి. అలాగే ఆయా కార్యక్రమాల వద్ద వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ వినియోగం ప్రమాదరంగా మారుతోంది. అవి ఏళ్ల తరబడి భూమిలో కలవడంలేదు. వాటిని పడేస్తున్న పంటపొలాలు, చెరువులు ప్రమాదకరంగా మారుతున్నాయి. వాటిని నియంత్రించాల్సిన అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో పర్యావరణం కలుషితమై చాపకింద నీరులా విస్తరిస్తోంది.
ప్రమాదకర రసాయనాలు
పేపర్ ప్లేట్లు, కప్పుల్లో ప్రమాదకర రసాయనాలు ఉంటున్నాయి. హైడ్రోఫోబిక్ ఫిల్మ్ పొరను వాటి తయారీలో వినియోగిస్తున్నారు. మోట్రో సోమిన్, బిస్పినాల్, బార్డ్ ఇథనాల్ డాక్సిన్ వంటి కెమికల్స్ ఈ ప్లేట్లు, కప్పుల్లో ఉంటున్నాయి. వాటిలో వేడి వేడి ఆహార పదార్థాలు వేసిన వెంటనే కరిగి ఆయా ఆహార పదార్థాల ద్వారా మానవ శరీరంలోకి చేరుతాయి. దీంతో చర్మసంబంధిత వ్యాధులతో పాటు ప్రమాదకర క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారు.
విందులో విష సంస్కృతి
విందులో విష సంస్కృతి
విందులో విష సంస్కృతి
Comments
Please login to add a commentAdd a comment