జిల్లాలో బర్డ్‌ఫ్లూ లేదు
● గుడ్లు, మాంసం రవాణాపై ఆంక్షలు లేవు
● పశు సంవర్థక శాఖ జేడీ వైవీ రమణ
విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకిన నేపథ్యంలో జిల్లాలోని కోళ్ల పెంపకం పరిశ్రమ కలిగిన రైతులు, పౌల్ట్రీ యాజమానులు జిల్లాలోని కోళ్లకు ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగా జీవ భద్రత చర్యలు చేపట్టాలని పశు సంవర్థకశాక జేడీ డాక్టర్ వైవీ రమణ తెలిపారు. కోళ పరిశ్రమ యాజమానులు, రైతులకు శుక్రవారం పశు సంవర్థకశాఖ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ జిల్లాలో బర్డ్‌ఫ్లూ లేదని, గుడ్లు, కోడి మాంసం ఉత్పత్తులను 100 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో వండుకుని ప్రజలు అందరూ నిర్భయంగా తినొచ్చని పేర్కొన్నారు. కోడిగుడ్లు, మాంసం ఉత్పత్తులపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్‌తో కలిసి పశు సంవర్థకశాఖ త్వరలో కోడిమాంసం, గుడ్ల వంటకాలతో జిల్లా కేంద్రంలో త్వరలోనే ఒక మేళాను నిర్వహించి ప్రజల్లో ఉన్న అపొహలు తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో బహుళార్థ పశు వైద్యశాల ఉప సంచాలకురాలు డాక్టర్ జి.మహాలక్ష్మి, పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సహాయ సంచాలకుడు డాక్టర్ ఎంబీవీ ప్రసాద్, ఎ.డి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment