నకిలీ స్టాంపులు విక్రయిస్తే కఠిన చర్యలు
● సబ్‌రిజిస్ట్రార్ శ్రీనువాసులు
● సాక్షి కథనానికి స్పందన
వీరఘట్టం: మండల కేంద్రంలో స్టాంపులను కలర్ జిరాక్స్ తీసి విక్రయిస్తున్నారని శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన ‘జోరుగా నకిలీ స్టాంపుల విక్రయాలు’ కథనంపై అధికారులు స్పందించారు.ఈ మేరకు పాలకొండ సబ్ రిజిస్ట్రార్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం తయాచేస్తున్న స్టాంపుల మాదిరిగా నకిలీవి తయారుచేస్తే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని సబ్ రిజిస్ట్రార్ హెచ్చరించారు.కొద్దిరోజుల్లో వీరఘట్టం–పాలకొండ పట్టణాల్లో కలర్ జిరాక్స్‌లు తీస్తున్న అన్ని షాపులు తనిఖీ చేస్తామన్నారు. అలాగే ప్రజలు కూడా తమ అవసరాలు కోసం ప్రైవేట్ షాపుల్లో కొనుగోలు చేస్తున్న స్టాంపులు నకిలీవా? ఒరిజనల్‌వా? అని పరిశీలించుకోవాలని సూచించారు. స్టాంపుల విక్రయాలకు ప్రైవేట్ జిరాక్స్ షాపులకు ఎటువంటి అనుమతులు లేవని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
ఖలీల్‌బాబుకు స్పిరిట్యువల్ సైంటిస్ట్ అవార్డ్
విజయనగరం టౌన్: విశ్వసమైక్యతకు కృషిచేస్తున్న సూఫీ పరంపర వారసుడు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఖలీల్‌బాబుకు ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సెంటర్, ఆంధ్రాయూనివర్సిటీ అనుబంధ డీన్‌వాన్‌ల్యూవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్, ఆంధ్రాయూనివర్సిటీ సంయుక్తంగా స్పిరిట్యువల్ సైంటిస్ట్ అవార్డును అందజేశాయి. ఈ మేరకు శుక్రవారం డీన్‌వాన్ వాన్‌ల్యూవెన్ సెంటర్ ఈడీ చల్ల కృష్ణ విజయనగరంలో ఉన్న దర్బార్‌కు వచ్చి ఖలీల్‌బాబును సత్కరించి అవార్డు ప్రదానం చేశారు. ఖాదర్‌బాబాపై భక్తితో తాను స్వయంగా రాసిన ఇంగ్లీష్ కవితలతో కూడిన పుస్తకాన్ని ఖలీల్‌బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ అధ్యాపకుడు డాక్టర్ పీవీ.గోపాలరాజు, అహమ్మద్ బాబు, రంగారావు బాబాయ్, సంతోష్, జ్ఞానేశ్వర్, ఖాదర నాగూర్ తదితరులు పాల్గొన్నారు.
బత్తిలి పోలీసుల ఔదార్యం
● ఆరు తులాల బంగారంతో బ్యాగ్ అప్పగింత
భామిని: మండలంలోని బత్తిలి పోలీసులు బంగారం పోగొట్టుకొన్న బాధితుల విషయంలో శుక్రవారం తమ ఔదార్యం చాటుకుని ఆదర్శంగా నిలిచారు. బత్తిలి వచ్చే ఆర్టీసీ బస్సులో మరిచిపోయిన ఆరు తులాల బంగారు వస్తువులతో ఉన్న బ్యాగ్‌ను బాలేరుకు చెందిన బాధితులు వడ్డివాడ రామకృష్ణ దంపతులకు ఆప్పగించి ప్రజల మొప్పు పొందారు. కొత్తకోట నుంచి ఆర్టీసీ బస్సులో బాలేరు వస్తూ బంగారు వస్తువులు ఉన్న బ్యాగ్ మరిచిపోయి వారు దిగిపోయారు. వెనువెంటనే బాలేరు వైఎస్సార్‌సీపీ నాయకుడు మేడిబోయిన చలపతి ఆధ్వర్యంలో బత్తిలి ఎస్సై డి.అనిల్‌కుమార్‌కు సమాచారం ఇవ్వడంతో బత్తిలిస్టేషన్ సిబ్బందికి సమాచారం అందించి ఆర్టీసీ బస్సులో బంగారు వస్తువులతో గల బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. బత్తిలి స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుడు చలపతి సమక్షంలో బాధితులకు బంగారు వస్తువుల బ్యాగ్ అందించి పలువురి మన్ననలు పొందారు.
ఘనంగా ముగిసిన
దుర్గాలమ్మ తీర్థం
లక్కవరపుకోట: మండలంలోని సంతపేట గ్రామదేవత దుర్గాలమ్మ అమ్మవారి తీర్థం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ పోటీల్లో మొత్తం 8 ఎడ్లబళ్లు పాల్గొనగా వాయిల్పాడుకు చెందిన శ్రీమరిడిమాంబ ఎడ్లు ప్రథమస్థానం సాధించాయి. కలగాడకు చెందిన పోలిపర్తి సత్తిబాబు ఎడ్లు ద్వితీయ స్థానం, వావిలపాడుకు చెందిన పరిదేశమ్మతల్లి ఎడ్లు తృతీయ స్థానం, దేవరాపల్లికి చెందిన వీరాంజనేయ ఎడ్లు నాలుగవ స్థానం, దేవరాపల్లికి చెందిన శ్రీలక్ష్మీనరసింహ ఎడ్లు 5వ స్థానం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన వారికి నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు.
నకిలీ స్టాంపులు విక్రయిస్తే కఠిన చర్యలు
నకిలీ స్టాంపులు విక్రయిస్తే కఠిన చర్యలు
Comments
Please login to add a commentAdd a comment