ఉల్లాసంగా ‘శారడ’ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
● ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన 9 జట్లు
● రెండు రోజుల పాటు జరగనున్న పోటీలు
కొత్తవలస: మండలంలోని కంటకాపల్లి గ్రామం సమీపంలో గల శారడ మెటల్స్ అండ్ ఎల్లాయీస్ లిమిటెడ్ కర్మాగారం సహకారంతో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు కొత్తవలస –విజయనగరం రోడ్డులో గల బారత్ డిఫెన్స్ అకాడమీ గ్రౌండ్‌లో శుక్రవారం ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, శారడ పరిశ్రమ వైస్‌ప్రెసిడెంట్ సనత్‌కుమార్, ప్రభాత్ మోహన్ ప్రారంభించారు. జాతీయ వాలీబాల్ కోచ్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గవర సూరిబాబు, స్కూల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.కృషంరాజుల నిర్వహణలో పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో గల 9 నియోజకవర్గాల నుంచి ఒక్కో టీమ్ వచ్చినట్లు తెలిపారు. ప్రతి టీమ్‌కు 10 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ పోటీలు లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో గెలుపొందిన మొదటి జట్టుకు రూ.1,25,000, ద్వితీయ స్థానం సాధించిన జట్టుకు రూ.60,000, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.30,000, నాల్గోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.25,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, క్రీడాకారులకు టీషర్టులను, బాల్స్, నెట్‌లను శారడ కర్మాగారం సమకూర్చినట్లు తెలిపారు. శనివారం ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో భారత్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కడారి రాజు, సర్పంచ్‌లు మదినా అప్పలరమణ, పీతల కృష్ణ, శారడ కార్మగారం ప్రతినధులు ఆశోక్‌కుమార్ చౌదరి, మూర్తి, హెచ్.సన్యాసిరావు, జి.శంకరావు తదితరులు పాల్గొన్నారు.
ఉల్లాసంగా ‘శారడ’ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment