పోలీసుల అదుపులో గంజాయి నిందితులు
విజయననగరం క్రైమ్: విజయనగరం వన్‌టౌన్ పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను గురువారం అదుపులో తీసుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ శ్రీనివాస్, వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రేవతి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు. రాయగడ, విజయనగరానికి చెందిన ఇద్దరు యువకులు చెడు వ్యసనాలను అలవాటు పడి డబ్బుల కోసం గంజాయి ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. ఈ మేరకు విజయనగరం ఓల్డ్ రైల్వే క్వార్టర్స్ వద్ద ఇద్దరు నిందితులు గంజాయి ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రేవతి ఘటనా స్థలికి వెళ్లి నిందితులను పట్టుకుని విచారణ చేసి వారి దగ్గర ఉన్న రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అదుపులోకి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment