లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి
విజయనగరం లీగల్: వచ్చేనెల 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయికళ్యాణ్ చక్రవర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.వి.రాజేష్‌కుమార్, ఏఎస్పీ అంకిత సురాన అన్నారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పోలీస్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రాజీకాదగిన అన్ని క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవీరత్నకుమారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బి.రమ్య, మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి.బుజ్జి, ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.
పోలీస్ అధికారులకు పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి
Comments
Please login to add a commentAdd a comment