అంగన్‌వాడీలకు మరుగుదొడ్లు ఉండాల్సిందే...
విజయనగరం ఫోర్ట్: ప్రతీ అంగన్‌వాడీ కేంద్రానికి మరుగుదొడ్లు ఉండాల్సిందేనని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్పష్టంచేశారు. మరుగుదొడ్లు ఉన్న భవనాల్లోకి అంగన్‌వాడీ కేంద్రాలను మార్చాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తూ విద్యుత్, మరుగుదొడ్లు సదుపాయం లేని అంగన్‌వాడీ కేంద్రాల వివరాలను తక్షణమే తెలియజేయాలన్నా రు. పిల్లల బరువు, ఎత్తుకొలతల నమోదు 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ రుక్షనా భేగం, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, డీఈఓ మాణిక్యంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment