పరీక్షలను పరిశీలిస్తున్న డీఈసీ మెంబర్స్
వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు గరువారం ఉదయం నిర్వహించిన జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్‌లో 807 మందికి గాను, 773 హాజరు కాగా.. 34 మంది గైర్హాజరయ్యారని, మధ్యాహ్న సెషన్‌లో 478 మందికి గాను, 455 మంది హాజరు కాగా.. 23 మంది గైర్హాజరయ్యారని డీఈసీ మెంబర్స్ ప్రకాశంశెట్టి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
రెండో రోజు 52 మంది హాజరు
వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో రెండో రోజు 52 మంది హాజరైనట్లు పరీక్షల సహాయ సంచాలకులు మధుకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన పరీక్షలో తెలుగు మీడియంలో 31 మంది, ఇంగ్లీష్ మీడియంలో 26 మంది మొత్తం 57 మంది అభ్యర్థులను అలాట్‌మెంట్ చేయగా.. తెలుగు మీడియంలో 28 మంది, ఇంగ్లీష్ మీడియంలో 24 మంది మొత్తం 52 మంది హాజరైనట్లు చెప్పారు. తెలుగులో ముగ్గురు, ఇంగ్లీష్‌లో ఇద్దరు చొప్పున మొత్తం ఐదుగురు అభ్యర్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. దీంతో 91 శాతం హాజరు నమోదయినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment