
యూరియా నిల్వలు పరిశీలించిన అధికారులు
పాన్‌గల్: స్థానిక సింగిల్‌విండో కార్యాలయంలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ‘రైతులకు యూరియా తిప్పలు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన ఏడీఏ చంద్రశేఖర్, ఏఓ రాజవర్ధన్‌రెడ్డి కార్యాలయాన్ని సందర్శించి యూరియా నిల్వలు, సరఫరాను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్యాలయంలో సీజన్‌కు సరిపడా 90 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వెంట సింగిల్‌విండో సీఈఓ భాస్కర్‌గౌడ్, వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

యూరియా నిల్వలు పరిశీలించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment