కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డేని పురస్కరించుకొని ఆదివారం ఫ్లాష్ మాబ్, ట్రెడిషనల్ డేను నిర్వహించారు. విద్యార్థుల మెహందీ డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు ఫొటోప్రేమ్‌లు సుందరంగా తయారు చేశారు. కళాశాల ఆవరణలో ఫ్లాష్‌మాబ్‌తో అదరగొట్టారు. అలాగే నేడు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు కళాశాల వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్‌డే అండ్ కల్చరల్ డేను కూడా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.రమణ తెలిపారు.