
మూల్యాంకనంలో లోపాలు ఉండొద్దు
● ఇంటర్‌బోర్డు అధికారి వెంకటేశ్వర్‌రావు
వరంగల్: ఇంటర్మీడియట్ పరీక్షపత్రాల మూల్యాంకనంలో ఎలాంటి లోపాలు ఉండొద్దని ఇంటర్‌బోర్డు అధికారి వెంకటేశ్వర్‌రావు అన్నారు. వరంగల్‌లోని లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి మాట్లాడారు. ఈనెల 10 నుంచి సంస్కృతం సబ్జెక్టుతో మూల్యాంకనం ప్రారంభమైందని అన్నారు. ఇంటర్‌బోర్డు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభమైన స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) డాక్టర్ శ్రీధర్‌సుమన్ తెలిపారు. వరంగల్‌తోపాటు మహబూబాబాద్, ములుగు జిల్లాల సిబ్బందికి శిక్షణ ఇచ్చి మూల్యాంకనం ప్రారంభించాలని సూచించారు. ఈ నెల 22 నుంచి మొదటి స్పెల్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్, 24 నుంచి రెండో స్పెల్‌లో ఫిజిక్స్, ఎకనామిక్స్, 26 నుంచి మూడో స్పెల్‌లో కెమిస్ట్రీ, కామర్స్, 28 నుంచి నాలుగో స్పెల్‌లో హిస్టరీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులు ప్రారంభించనున్నట్లు డీఐఈఓ పేర్కొన్నారు. మూల్యాంకన కేంద్రంలో కల్పించిన వసతులపై బోర్డు అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.