గీసుకొండ: ఒకే దేశం..ఒకే ఎన్నికతో ఆర్థిక మిగులుబాటు ఉంటుందని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గట్టికొప్పుల రాంబాబు అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏక కాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల సంఘంపై భారం, కాలం వృథా తగ్గి, రాజకీయ స్థిరత్వం నెలకొని శాశ్వత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గాల డీ లిమిటేషన్‌పై ప్రజలను తప్పుదారి పట్టించేలా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు అనరసరమైన రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. బీజేపీ డివిజన్ అధ్యక్షురాలు జాలిగపు ప్రసన్న, జిల్లా కౌన్సిల్ మెంబర్ గోదాసి అశ్వినికుమార్, మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు బండారి కల్యాణి, నాయకులు ఆరె కుమార్, సభావత్ గణేశ్, సంకతాల శ్రీనివాస్, బైకని వెంకటేశ్, బొమ్మగాని దిలీప్, సభావత్ నాగరాజు, పోలెబోయిన నవీన్, సరిత, అశోక్, పర్ష నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మొగిలిచర్లలో..
గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ మొగిలిచర్లలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు రాదారపు శివకుమార్, ల్యాదల్ల ప్రభాకర్, ఆడెపు రమేశ్, బిల్లా రమేశ్, లెంకలపెల్లి స్వామి, గుండెబోయిన రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాంబాబు