వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సన్‌ప్రీత్‌సింగ్‌ను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంతోషినితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. నేరానికి పాల్పడిన నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసి బాధితులకు న్యాయం అందించాలని కోరారు. సీపీని కలిసిన వారిలో అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మురళీధర్‌రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రవికిరణ్, బృంద, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పావని, దుర్గాబాయి తదితరులు ఉన్నారు.