
పులి చెరువులో అరుదైన చేపలు
ఐనవోలు: మండల కేంద్రంలోని పులి చెరువులో బుధవారం ముదిరాజ్‌ల వలకు అరుదైన చేపలు చిక్కాయి. కాగా.. ముదిరాజ్‌లు, పలువురు బాటసారులు, గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనై ఆసక్తిగా తిలకించారు. ఈ చేపలు 180 గ్రాముల నుంచి 235 గ్రాముల మధ్యలో ఉన్నట్లు సుమారు 20 చేపలు వలలో పడ్డట్లు స్థానిక ముదిరాజ్ కుల సంఘం అధ్యక్షుడు సంపత్ తెలిపారు. ఈ చేప చర్మంపై మచ్చలు, జీబ్రా మాదిరిగా తెలుపు, నలుపు చారలతో పాటు కొమ్ములు ఉండగా.. పొడవాటి రె క్కలు, వెన్నెముక, తోక ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ చేప శాసీ్త్రయ నామం సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అని, స్థానికంగా దెయ్యం చేప అని పిలుస్తారని తెలిపారు. ఇలాంటి చేపలు ఎక్కువ నీళ్లు ఉండే చెరువుల్లో, కాలువల్లో అరుదుగా ఉంటాయని చెప్పారు. ఈచేప తక్కువ కాలంలోనే పదుల రెట్లు తన సంతానాన్ని వృద్ధి చేస్తుందన్నారు.