
పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు శిక్షణ
వరంగల్: జిల్లాలో పదోన్నతి పొందిన పీజీ హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం గురువారం వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉండ్రాతి సుజన్‌తేజ మాట్లాడుతూ ప్రతి ప్రధానోపాధ్యాయుడు నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని పాఠశాలల అవసరాలకు తగిన విధంగా విజన్, మిషన్ రూపొందించుకోవాలని సూచించారు. తరగతి గదిలో బోధనాభ్యాసన ప్రక్రియలు సమర్థవంతంగా నిర్వహించే విధంగా చూడాలన్నారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాలతోపాటు అభ్యసన ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారదాబాయి, రిసోర్స్ పర్సన్లు ఎస్. రవీందర్, జిల్లా సైన్‌న్స్ అధికారి డాక్టర్ శ్రీనివాస్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్, కమలాకర్, టి.రమేశ్, ఆనందరావు, సీహెచ్.శ్రీనివాస్, గౌస్‌పాషా పాల్గొన్నారు.