
జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
వరంగల్ లీగల్ : కోర్టు ప్రాంగణంలో ప్రమాదకర మందుపాతరలు ఏర్పాటు చేశాం.. మధ్యాహ్నం 2 గంటలకు పేలే ప్రమాదం ఉందని శుక్రవారం ఉదయం 7.11 గంటలకు జిల్లా కోర్టు అధికార మెయిల్‌కు ఓ సందేశం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు, హైకోర్టుకు సమాచారం అందించారు. స్పందించిన పోలీస్ యంత్రాంగం డాగ్ అండ్ బాంబ్ స్క్వాడ్‌ల ద్వారా తనిఖీలు చేపట్టారు. విషయం తెలిసి న్యాయమూర్తులు, న్యాయవాదులు కేసులకు సంబంధించి కోర్టుకు వచ్చిన కక్షిదారులను పంపించారు. తమిళనాడు లిబరేషన్ ఆర్మీ(టీఎన్‌ఎల్‌ఏ) ఎస్.మారన్– వింగ్ ద్వారా ఈ మెయిల్ వచ్చినట్లు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. సల్ఫర్ ఆక్సిడైజ్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్(ఐఈడీఎస్) పేలుడు పదార్థాలు ఏర్పాటు చేసినట్లు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం చైన్నెకి చెందిన జర్నలిస్టు సువుక్కు శంకర్‌పై అమానవీయంగా ప్రవర్తించిన తీరు, అలాగే ఇటీవల రిమోట్ కంట్రోల్ సిస్టంను దుర్వినియోగం చేసి నివేత పేతురాజ్, ఉదయనిధి స్టాలిన్‌ల విషయాలను లీకేజీ చేసిన ఘటనలో డీఎంకే ప్రభుత్వంపై ప్రతీకారంగా ఈ పేలుడుకు పాల్పడుతున్నట్లు మెయిల్‌లో వివరించారు.
టీఎన్‌ఎల్‌ఏ ఎస్.మారన్
వింగ్ ద్వారా మెయిల్
బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్‌ల తనిఖీ