వరంగల్ పోలీస్ కమిషనర్
సన్‌ప్రీత్ సింగ్
శాయంపేట : నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ అవసరం.. ఇందుకు గ్రామాల్లో పెట్రోలింగ్ నిరంతరం చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. అనంతరం విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను సీఐ రంజిత్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, పరకాల ఏసీపీ సతీశ్‌బాబు, ఎస్సై జక్కుల పరమేశ్ ఉన్నారు.