
బాబూ జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి
రామన్నపేట: మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను వరంగల్ ఎల్‌బీ కళాశాలలోని జయసేన మెమోరియల్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.