
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి●
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
పర్వతగిరి: రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్నారంషరీఫ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జైబాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అంబేడ్కర్ ఇచ్చిన స్ఫూర్తి, గాంధీజీ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకుకెళ్లేందుకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతం భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి రమేశ్ ఇంటిలో సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌నాయక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్‌రావు, జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు, ఇన్‌చార్జ్ కోఆర్డినేటర్ దూపాకి సంతోష్, మహిళా మండలి నాయకురాలు మాసాని సువార్త తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను నిలదీసిన
రావూరు గ్రామస్తులు
పాదయాత్రలో భాగంగా రావూరు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే నాగరాజును తండావాసులు ప్రశ్నలతో ముంచెత్తారు. ఆరు గ్యారంటీల అమలుపై మహిళలు నిలదీశారు. ఆకేరు వాగు నీటిని పంటలకు అందించడంలో విఫమయ్యారని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావును వారు హెచ్చరించారు.