
పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం
గీసుకొండ: పేదల సంక్షేమం, వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్‌ఽ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ హితం, సుస్థిరత, అభివృద్ధి కోసం బీజేపీ పాటుపడుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు కుసుమ సతీశ్, గట్టికొప్పుల రాంబాబు, వన్నాల వెంకటరమణ, బాకం హరిశంకర్, తిరుపతిరెడ్డి, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, కపిల్‌కుమార్, కనుకుంట్ల రంజిత్‌కుమార్, 16వ డివిజన్ అధ్యక్షురాలు జాలిగపు ప్రసన్న రాంప్రసాద్ పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి
వరంగల్: కలెక్టరేట్‌లో సోమవారం(నేడు) ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించేందుకు రావాలని ఆమె సూచించారు.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
వరంగల్ చౌరస్తా : వరంగల్ 27వ డివిజన్ అబ్బనికుంటలో ఆదివారం ఓ రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ప్రారంభించారు. బీజేపీ నాయకులు కనుకుంట్ల రంజిత్ తదితరులు అక్కడికి చేరుకొని రేషన్ షాపు ఎదుట ప్రధాని మోదీ ఫొటో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్ది సమయం తర్వాత సద్దుమణిగింది.

పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం